Narender Vaitla |
Updated on: Jun 28, 2022 | 8:39 AM
వన్‌ప్లస్ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేస్తోంది. వన్‌ప్ల్ టీవీ 50 వై1ఎస్ ప్రో (OnePlus TV 50 Y1S Pro) పేరుతో త్వరలోనే భారత్‌లోకి ఈ స్మార్ట్ టీవీ అందుబాటులోకి రానుంది.
ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 50 ఇంచెస్‌తో కూడిన 4కే యూహెచ్‌డీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఇమేజ్ క్వాలిటీ కోసం10-బిట్ కలర్ డెప్త్‌ను అందించారు.
వన్‌ప్లస్ ఈ టీవీలో డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 24 వాట్ల సౌండ్ ఔట్‌పుట్ ఇచ్చే స్పీకర్లను అందించనుంది. వన్‌ప్లస్ వాచ్ ద్వారా టీవీని కంట్రోల్ చేసుకోవడం విశేషం.
అలాగే ఇందులో స్లీప్ డిటెక్షన్ అనే ప్రత్యే ఫీచర్‌ను అందించారు. ఒకవేళ యూజర్లు టీవీని చూస్తూ నిద్రలోకి జారిపోతే దానంతంట అదే స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది.
8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రానున్న 50 ఇంచులు టీవీ ధర రూ. 35,000ల ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే వన్‌ప్లస్ ఇటీవల 43 ఇంచెస్‌తో కూడిన వన్‌ప్లస్ టీవీ 43 వై1ఎస్ ప్రో ధర రూ.28,9999గా ఉంది.