విద్యార్థుల దగ్గర నుంచి బిజినెస్ మెన్ వరకు.. రంగం ఏదైనా, ఉద్యోగం మరేదైనా అందరికీ జీమెయిల్(Gmail) ఉండాల్సిందే. అంతలా దానిపై ఆధారపడేలా చేసింది ఆధునిక సాంకేతికత. సోషల్ మీడియా తరహాలో పోస్టింగ్లు గట్రా ఏమి లేకపోయినా.. వ్యక్తికీ వ్యక్తికి మధ్య.. వ్యక్తులకూ, సంస్థలకు మధ్య సమాచార వారధిగా జీమెయిల్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. చాలామంది జీమెయిల్ ఖాతాలను రోజూ వారి ఓపెన్ చేయరు.. మరికొందరు చేసినా.. వచ్చిన అన్ని మెయిళ్లను చూసుకోరు. తమకు అవసరం, ఇంపార్టెంట్ అనుకున్నవి మాత్రమే చూసుకొని మిగిలినవి అలాగే వదిలేస్తారు. ఫలితంగా ఇన్‌బాక్స్ నిండిపోతుంది. వేల కొద్దీ మెయిల్స్ అన్ రీడ్ లో ఉండిపోతాయి. దీంతో జీమెయిల్ మెమరీ వృథా అవుతుంది. ఒకవేళ మీరు పేరుకుపోయిన ఆ మెయిల్స్ ను డిలీట్ చేయాలన్నా కష్టమవుతుంది. ఒక్కోటి సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయాలంటే పెద్ద ప్రయాస అవుతుంది. సమయం వృథా అవుతుంది. మీరు ఇటువంటి సమస్యను ఫేస్ చేసే ఉంటారు. మీలాంటి వారి కోసమే జీమెయిల్‌లో ఒక ఆప్షన్ ఉంది. వేలకొలదిగా ఇన్‌బాక్స్‌లో పేరుకుపోయిన మెయిల్స్ ను ఒక్క క్లిక్‌తో డిలీట్ చేసేయొచ్చు. ఆ ఫీచర్ వివరాలు మీ కోసం..
ఓ అధ్యయనం ప్రకారం ఏ వ్యక్తి జీమెయిల్ ఖాతాకు సగటున 126 ఈమెయిల్స్ వస్తాయని అంచనా. దీనిలో కేవలం 20 నుంచి 40 శాతం వరకూ మాత్రమే ఆ వ్యక్తి ఓపెన్ చేసి చూస్తాడు. మిగిలిన మొత్తం అలాగే ఇన్‌బాక్స్‌లో ఉండి పోయి మీ మెయిల్ మెమరీని వృథా చేసేస్తాయి. అలాంటి అన్‌రీడ్ మెయిల్స్ అన్నింటినీ సులభవంగా డిలీట్ చేసేందుకు ఓ ఫీచర్ అందుబాటులో ఉంది. అక్టోబర్ 2022 నుంచి జీమెయిల్ దీనిని ప్రారంభించింది. అయితే జీమెయిల్ వెబ్ వర్షన్‌లో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్, ఐప్యాడ్ వంటి వాటిల్లో ఈ ఫీచర్ అందుబాటులో లేదు.
మీరు డిలీట్ చేయాలనుకునే మెయిల్స్‌ను మొత్తం డిలీట్ కొట్టొచ్చు లేదా ఆర్కైవ్స్‌లోకి పంపొచ్చు. ఇలా ఆర్కైవ్స్‌లో పంపడం ద్వారా అవి శాశ్వతంగా డిలీట్ అయ్యే బదులు 30 రోజుల పాటు మెయిల్ ట్రాష్ బిన్‌లో అలా సేవ్ అయ్యి ఉంటాయి. ఫలితంగా మీరు డిలీట్ చేసేసిన మెయిల్స్‌ను 30 రోజుల్లోపు మళ్లీ పొందే అవకాశం ఉంటుంది. కానీదీనివల్ల మెమరీ వినియోగాన్ని నష్టపోవాల్సి వస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..