AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earth Quake Alerts: ప్రపంచవ్యాప్తంగా భూకంపాల మానిటరింగ్..ఐఫోన్ యూజర్లకు ఈ యాప్స్ తో భూకంపం ఎలర్ట్స్

ఐ ఫోన్ యూజర్లు అయితే మీకు భూకంప హెచ్చరికలు కూడా వస్తాయి. ఐ ఫోన్ యూజర్లు కొన్ని యాప్స్ ఇన్ స్టాల్ చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా భూకంపం ఎక్కడ వస్తుందని మనం మానిటర్ చేయవచ్చు. తద్వారా విదేశాల్లో ఉన్న మన బంధువులను కూడా అలర్ట్ చేసే అవకాశం ఉంది.

Earth Quake Alerts: ప్రపంచవ్యాప్తంగా భూకంపాల మానిటరింగ్..ఐఫోన్ యూజర్లకు ఈ యాప్స్ తో భూకంపం ఎలర్ట్స్
Earthquake
TV9 Telugu Digital Desk
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 28, 2022 | 5:14 PM

Share

భూకంపం అనేది ప్రకృతి సృష్టించే విధ్వంసకర విపత్తు. ఈ విపత్తు ఎంత ప్రమాదకరంగా ఉంటుందంటే ప్రజలు ఆస్తులతో పాటు ప్రాణాలు కూడా కోల్పోతారు. తుఫాన్ హెచ్చరికలు వస్తుంటాయి కానీ ఎప్పుడు భూకంప హెచ్చరికలు రావు అని మనలో చాలా మందికి అనిపిస్తుంటుంది. అయితే మీరు ఐ ఫోన్ యూజర్లు అయితే మీకు భూకంప హెచ్చరికలు కూడా వస్తాయి. ఐ ఫోన్ యూజర్లు కొన్ని యాప్స్ ఇన్ స్టాల్ చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా భూకంపం ఎక్కడ వస్తుందని మనం మానిటర్ చేయవచ్చు. తద్వారా విదేశాల్లో ఉన్న మన బంధువులను కూడా అలర్ట్ చేసే అవకాశం ఉంది. ఈ యాప్స్ ఐ ఫోన్స్ లో పని చేయాలంటే కొన్ని సెట్టింగ్స్ ను మార్చాల్సి ఉంటుంది. ఐఓఎస్ లోని కొన్ని ఎమర్జెన్సీ ఫీచర్స్ ను యాక్సెప్ట్ చేస్తే ఈ యాప్స్ ఐ ఫోన్స్ లో పనిచేస్తాయి. ఐ ఫోన్స్ లో ఉపయోగపడే కొన్ని యాప్స్ ను ష్టార్ట్ లిస్ట్ చేశాం. ఈ యాప్స్ కచ్చితత్వంతో ఆకట్టుకోవడమే కాకుండా యూఎస్ జీఎస్ వంటి సంస్థలకు చెందిన డేటాను ఓపెన్ యాక్సెస్ చేయడంతో కచ్చితమైన సమాచారం వస్తుంది. ఇప్పుడు ఆ యాప్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

క్వేక్ ఫీడ్

భూకంప హెచ్చరికలు, ట్రాకింగ్ కోసం ఐ ఫోన్ యూజర్లకు అందుబాటులో ఉన్న అద్భుతమైన యాప్ ఇది. ఈ యాప్ యూఎస్ జీఎస్ నుంచి డేటాను సోర్స్ చేయడంతో కచ్చితమైన సమాచారం వస్తుంది. ఈ యాప్ హోం స్క్రీన్ లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన భూకంపాల జాబితాను అందిస్తుంది. డీఫాల్ట్ గా తేదీ మారుతూ భూకంప తీవ్రత, ఎంత దూరంలో వచ్చిందో చూపుతుంది. అలాగే మనకు డైలీ అలర్ట్ కూడా వస్తాయి.

మై షేక్

మైషేక్ యాప్ కెనడా విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన యాప్. ఇది యూఎస్ జీఎస్ ద్వారా షేక్ అలర్డ్ ను వినియోగించుకుంటుంది. భూకంపం సంభివించబోతున్నపుడు ఈ యాప్ ద్వారా వాయిస్ అలర్ట్ వస్తుంది. మొబైల్ సైలెంట్ మోడ్ లో ఉన్నా వాయిస్ కమాండ్ రావడం ఈ యాప్ ప్రత్యేకత.

ఇవి కూడా చదవండి

మై ఎర్త్ క్వేక్ అలర్ట్స్ అండ్ ఫీడ్

ఈ యాప్ లో కూడా ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలను మానిటర్ చేసే అవకాశం ఉంది. ఇందులో మనం సెలెక్ట్ చేసుకున్న ప్రాంతాల భూకంప హెచ్చరికలను కూడా మానిటర్ చేయవచ్చు. గతంలో ఆ ప్రాంతంలో ఎంత స్థాయిలో భూకంపం వచ్చిందో కూడా తెలుసుకోవచ్చు. ఈ యాప్ లో ఉండే ప్రో వెర్షన్ యాపిల్ స్మార్ట్ వాచ్ లకు కూడా ఎలర్ట్ పంపేలా డిజైన్ చేశారు. 

ఎర్త్ క్వేక్ ప్లస్

ఈ యాప్ చాలా సరళమైన యాప్. యూఎస్ జీఎస్, ఈఎంఎస్సీ, సీఎన్ డీసీ వంటి సంస్థల ద్వారా డేటాను సోర్స్ చేస్తుంది. ఈ యాప్ హోం స్క్రీన్ లో లేబుల్ చేసిన ఫిల్టర్ల ఆధారంగా భూకంప ప్రాంతం, పరిమాణం వంటి విషయాలను తెలుసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా వచ్చే ఎలర్ట్స్ ఐ ఫోన్ వాచ్ ద్వారా  కూడా మానిటర్ చేయవచ్చు. 

ఎర్త్ క్వేక్స్- లేటెస్ట్ అండ్ అలర్ట్ 

ఈ భూకంప ట్రాకింగ్ కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన కార్యకలాపాల కోసం 22 విభిన్న మూలాధారాలను ఎంచుకోవాలని కోరుతుంది. ఈ యాప్ యూఎస్ జీఎస్, ఈఎంఎస్సీ, బీజీఎస్ వంటి ఫీచర్లు ఉండడంతో వీటిని ఆన్ చేయడంలో అయోమయానికి గురవుతాం. ఈ యాప్ లో కూడా ప్రాంతం, తేదీ ఆధారంగా డేటాను చూసుకోవచ్చు. లోకేషన్ కోసం యాపిల్ మ్యాప్స్ ను ఉపయోగించడంతో కచ్చితమైన సమాచారం వస్తుంది. 

లాస్ట్ క్వేక్

ఈ యాప్ చాలా పాతది. అయినా కచ్చితమైన సమాచారం ఇవ్వడంతో చాలా మంది వినియోగదారులు ఈ యాప్ ను ఇష్టపడుతున్నారు. భూకంప కార్యకలాపాల ప్రతి ప్రవేశం, తేదీ, ప్రాంతం వంటి విషయాలను కచ్చితంగా పేర్కొంటుంది. ఈ యాప్ లో భూకంపంతో పాటు సునామీ హెచ్చరికలను కూడా మానిటర్ చేయవచ్చు. ఆ సమయంలో మనం పొందిన అనుభూతిని ఈ యాప్ నుంచే డైరెక్ట్ గా ట్విట్టర్ లో పోస్టో చేయవచ్చు. 

ఎర్ట్ క్వేక్ ప్లస్, అలెర్ట్స్, మ్యాప్స్ అండ్ ఇన్ ఫో

ఈ యాప్ కూడా ఇతర యాప్ ల మాదిరిగా అన్ని ఫీచర్లను కలిగి ఉంది. కానీ ఈ యాప్ లో ఉన్న ఇండివిడ్యువల్ ఎంట్రీస్ అనే ఆప్షన్ ద్వారా ఎంత మంది ఈ యాప్ ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నారో? చూడవచ్చు. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..