Brain Health: ఈ టెస్టు పాజిటివ్ తేలితే.. లక్షణాలు లేకున్నా మీకు ఆ రెండు వ్యాధుల రిస్క్ తప్పదు..!

భయంకరమైన మెదడు వ్యాధులు అయిన అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటివి లక్షణాలు కనిపించడానికి చాలా సంవత్సరాలు ముందుగానే గుర్తించదగిన ఒక సంచలనాత్మక రక్త పరీక్ష గురించి న్యూరాలజిస్ట్ డాక్టర్ జయ జగన్నాథన్ సమాచారం ఇచ్చారు. ఆ పరీక్ష పేరు న్యూరోఫిలమెంట్ లైట్ చైన్ (ఎన్ఎఫ్ఎల్) టెస్ట్. ఈ పరీక్ష మెదడు ఆరోగ్యాన్ని, నరాల కణాల నష్టాన్ని ఎలా సూచిస్తుంది? లక్షణాలు మొదలు కాకముందే ఈ బయోమార్కర్ ఎలా హెచ్చరిక ఇస్తుంది? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Brain Health: ఈ టెస్టు పాజిటివ్ తేలితే.. లక్షణాలు లేకున్నా మీకు ఆ రెండు వ్యాధుల రిస్క్ తప్పదు..!
Simple Blood Test Nfl Can Predict Brain Diseases

Updated on: Sep 28, 2025 | 11:31 AM

మెదడు వ్యాధులు లక్షణాలు కనిపించడానికి చాలా ఏళ్ల ముందుగానే వాటిని అంచనా వేయదగిన ఒక సాధారణ రక్త పరీక్ష గురించి యూఎస్ న్యూరాలజిస్ట్ డాక్టర్ జయ జగన్నాథన్ ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ పరీక్ష పేరు న్యూరోఫిలమెంట్ లైట్ చైన్ (ఎన్ఎఫ్ఎల్) బ్లడ్ టెస్ట్. ఇది భవిష్యత్తు మెదడు వ్యాధులను సూచించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

నరాల కణాల నష్టం సూచిక:

నరాల కణాలకు గాయం అయినప్పుడు విడుదల అయ్యే ఒక మార్కర్ న్యూరోఫిలమెంట్ లైట్ చైన్. ఇది మెదడు ఆరోగ్యాన్ని చెప్పే శక్తివంతమైన సూచికలలో ఒకటి. ఈ ప్రొటీన్ స్థాయిలు పెరిగితే అల్జీమర్స్, పార్కిన్సన్స్, మల్టిపుల్ స్క్లెరోసిస్ (MS), స్ట్రోక్, ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ వంటి వాటికి ముడి పడి ఉంటుంది.

డాక్టర్ జగన్నాథన్ వివరించిన దాని ప్రకారం, మీరు బాగున్నట్లు అనిపించినా ఎన్ఎఫ్ఎల్ ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. నరాల కణాలు త్వరగా రిపేర్ కావు. ఎన్ఎఫ్ఎల్ స్థాయిలు పెరగడం అంటే లక్షణాలు కనిపించడానికి చాలా ముందు నుంచే నిశ్శబ్దంగా మెదడు నష్టం జరుగుతోందని అర్థం.

ఎన్ఎఫ్ఎల్ ఒక బయోమార్కర్ గా ఎలా పనిచేస్తుంది?

సాధారణ పరిస్థితుల్లో, కొద్ది మొత్తంలో ఎన్ఎఫ్ఎల్ మెదడు, రక్తంలోకి విడుదల అవుతుంది. న్యూరాన్లు (నరాల కణాలు) లేదా వాటి ఆక్సాన్లు (Axons) దెబ్బతిన్నప్పుడు, ఎక్కువ ఎన్ఎఫ్ఎల్ పరిమాణం CSF, రక్తంలోకి విడుదల అవుతుంది. ఈ ద్రవాలలో ఎన్ఎఫ్ఎల్ కొలవడం ద్వారా నరాల నష్టం ఎంత వరకు జరిగిందో తెలుస్తుంది. CSF పరీక్ష కంటే రక్తంలో ఎన్ఎఫ్ఎల్ కొలవడం తక్కువ ఇన్వాసివ్ గా ఉంటుంది.

ఎన్ఎఫ్ఎల్ మార్కర్లు ఏమి సూచిస్తాయి?

పెద్దలలో ఎన్ఎఫ్ఎల్ సాధారణంగా ఈ విధంగా ఉపయోగపడుతుంది:

ఆరోగ్యకరమైన పెద్దలు: ఎన్ఎఫ్ఎల్ స్థాయిలు తక్కువగా ఉంటాయి.

వయస్సు ప్రకారం అధిక స్థాయిలు: ఇది నరాల నష్టం జరిగినట్లు సూచించే రెడ్ ఫ్లాగ్.

కాలక్రమేణా పెరిగితే: MRIలో ఏమీ కనిపించకపోయినా, లక్షణాలు మొదలు కాకపోయినా యాక్టివ్ వ్యాధి ఉందని అర్థం.

క్లినికల్ అప్లికేషన్స్
నిపుణుల ప్రకారం, ఎన్ఎఫ్ఎల్ స్థాయిలు న్యూరోలాజికల్ సమస్యల తీవ్రతను అంచనా వేస్తాయి. ఇది వ్యాధి కార్యాచరణను నిరంతరం ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా MS వంటి సమస్యలకు ఇది ముఖ్యం.

ఎన్ఎఫ్ఎల్ స్థాయిలను బట్టి, చికిత్సలు ఎంత బాగా పనిచేస్తున్నాయో పర్యవేక్షించవచ్చు.ఎన్ఎఫ్ఎల్ రక్త పరీక్షలు ఇతర పద్ధతుల కంటే తక్కువ ఇన్వాసివ్ గా ఉండటం వల్ల నిత్య పర్యవేక్షణకు అనుకూలం. ఎన్ఎఫ్ఎల్ రక్త పరీక్షను MRI వంటి న్యూరోఇమేజింగ్ పద్ధతులతో కలిపితే మెదడు, నాడీ వ్యవస్థ రుగ్మతలు గుర్తించడం, నిర్వహణ మెరుగుపడతాయి.