దేశంలో ప్రముఖ టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో తన ఖాాతాదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. రీచార్జి ప్లాన్ల ధరలను పెంచడంతో పాటు కొన్ని ప్లాన్లను రద్దు చేసింది. ఈ నిర్ణయంతో జియో వినియోగదారులు ఆశ్చర్యానికి లోనయ్యారు. పెరిగిన ధరలు వారిని కలవరపెడుతున్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అత్యంత జనాదరణ పొందిన రూ.395, రూ.1,559 ప్రీపెయిడ్ ప్లాన్లను జియో రద్దు చేయడంతో విమర్శలు కూడా వస్తున్నాయి. రిలయన్స్ జియో కంపెనీకి దేశంలో వినియోగదారులు చాలా ఎక్కువ. ఈ కంపెనీ చాలా తక్కువ ధరలకే రీచార్జి ప్లాన్లు అమలు చేసింది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తోంది. అపరిమిత కాల్స్, మెరుగైన డేటా ప్యాక్, అపరిమిత 5జీ డేటా సేవలతో దూసుకుపోతోంది. అయితే కొత్తగా తీసుకున్న ధరల పెంపు నిర్ణయంతో వినియోగదారులు విస్మయానికి గురయ్యారు.
తాజాగా జరిగిన మార్పులతో రిలయన్స్ జియో అపరిమిత 5జీ ప్లాన్‌లను నిలిపివేసింది. ఇది ఖాతాదారులలో చర్చనీయాంశమైంది. రీచార్జి కోసం అదనంగా ఖర్చుచేయాల్సి రావడంతో ఆందోళన వ్యక్తమైంది. భారతీయ మొబైల్ మార్కెట్ లో మార్పులకు కారణమైంది. జియో కొత్త రీచార్జి ప్లాన్ల ధరలు జూలై 3 నుంచి అమలులోకి వచ్చాయి.
జియో గతంలో అందించిన రూ.395 ప్లాన్ కు 84 రోజుల పాటు చెల్లుబాటు అయ్యేది. అలాగే రూ.1,559 ప్లాన్ 336 రోజుల పాటు సేవలు అందించేంది. ఈ రెండిటి నుంచి అపరిమిత 5జీ డేటాను వాడుకోవడానికి అనుమతి ఉండేది. ఈ నేపథ్యంలో ఈ ప్లాన్లను వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించేవారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..