ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. పిండి కొద్దీ రొట్టె అనే చందంగా డబ్బు కొద్దీ స్మార్ట్‌ఫోన్స్‌లో ఫీచర్లు మిళితమై వస్తాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సంస్థ సామ్‌సంగ్ మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఫోన్లను రూపొందించడంతో పాటు ప్రీమియం ఫోన్లను కూడా తయారుచేస్తుంది. సామ్‌సంగ్ ఎస్ సిరీస్ ప్రీమియం ఫోన్స్ మార్కెట్‌ను శాసించే స్థాయికు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎస్ 23 పేరుతో రిలీజ్ చేసిన ఫోన్ అత్యంత ప్రజాదరణ పొందింది. అయితే కొత్త ఏడాది ఎస్ 24 రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించింది. ఎస్-24 మొదటి అన్‌ప్యాక్డ్ ఈవెంట్ సమీపిస్తున్న కొద్దీ గెలాక్సీ ఎస్ 24 లైనప్ గురించి పుకార్లు, లీక్‌లు కూడా వెలువడుతున్నాయి. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం యొక్క తదుపరి అన్‌ప్యాక్డ్ ఈవెంట్ జనవరి 17న షెడ్యూల్ చేసింది. ఈ ఈవెంట్‌లో సామ్‌సంగ్ ఈ లైనప్‌లో మూడు మోడళ్లను పరిచయం చేస్తుందని భావిస్తున్నారు. వెనిలా గెలాక్సీ S24, S24+ S24 అల్ట్రా మోడల్స్ రిలీజ్ చేయనుంది. ఈ నేపథ్యంలో ఎస్ 24 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఇటీవల గెలాక్సీ ఎస్ 24 లైనప్‌నకు సంబంధించిన స్పెక్ షీట్‌సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో హల్ చల్ చేస్తుంది. మైక్రో బ్లాగింగ్ సైట్ నుంచి ఇప్పుడు తీసేసిన పోస్ట్ రాబోయే గెలాక్సీ ఎస్ 24 సిరీస్‌లోని అన్ని స్మార్ట్‌ఫోన్ మోడళ్ల హార్డ్‌వేర్ భాగాలను వెల్లడించింది. ఎస్ 24 యూఎస్, కెనడా, చైనా వంటి కొన్ని మార్కెట్‌లలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3ని కలిగి ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ ఫోన్‌లో ఎక్సినోస్ 2400 చిప్‌సెట్‌ను ఉపయోగించవచ్చు. సామ్‌సంగ్ ఎస్ ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 24, 6.2 అంగుళాల ఎమోఎల్‌ఈడీ 2 ఎక్స్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో రానుంది. 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8 జీబీ +128 జీబీ, 8 జీబీ + 256 జీబీ వేరియంట్‌లో ఈ ఫోన్ లాంచ్ అవకాశం ఉందని టెఖ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్‌తో వస్తుంది. అలాగా కేవలం 30 నిమిషాల్లో 50 శాతం గెలాక్సీ ఎస్ 24+ మోడల్ ఇదే కెమెరా సిస్టమ్‌తో వచ్చే అవకాశం ఉంది. అయితే ఎస్ 24 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో పెద్ద 6.7-అంగుళాల ఎమోఎల్‌ఈడీ 2 ఎక్స్ క్యూహెచ్‌డీ ప్లస్ డిస్ప్లే, 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ 12 జీబీ + 256 జీబీ వేరియంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా మోడల్‌లో ఐ ఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో వచ్చినట్లు టైటానియం బాడీతో రావచ్చు. అలాగే అల్ట్రా వేరియంట్ 200 ఎంపీ మెయిన్ లెన్స్, 10ఎక్స్ క్వాడ్ టెలిఫోటో, 100 ఎక్స్ స్పేస్ జూమ్‌తో కూడిన ఉన్నతమైన కెమెరా సిస్టమ్‌తో వచ్చే అవకాశం ఉంది. 6.8 అంగుళాల ఎమోఎల్‌ఈడీ 2 ఎక్స్ క్యూహెచ్‌డీ ప్లస్ డిస్ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..