Smartphone: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. బ్యాటరీ లైఫ్ పెంచేందుకు సామ్‌సంగ్ సరికొత్త ప్రయోగం..!

| Edited By: Janardhan Veluru

Apr 25, 2023 | 4:51 PM

స్మార్ట్ ఫోన్ వినియోగదారులను వేధించే ముఖ్యమైన సమస్య బ్యాటరీ. ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వినియోగించే వారు బ్యాటరీ లైఫ్ విషయంలో సమస్యలు ఎదుర్కొంటారు. అయితే ఈ సమస్యను అధిగమించడానికి ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్‌సంగ్ సరికొత్త ఆవిష్కరణకు సిద్ధమైందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Smartphone: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. బ్యాటరీ లైఫ్ పెంచేందుకు సామ్‌సంగ్ సరికొత్త ప్రయోగం..!
Samsung S24
Follow us on

Samsung Galaxy S24: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం రోజురోజుకూ పెరుగుతుంది. కంపెనీలు కూడా కస్టమర్లను ఆకట్టుకోవడానికి అధునాతన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ వినియోగదారులను వేధించే ముఖ్యమైన సమస్య బ్యాటరీ. ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వినియోగించే వారు బ్యాటరీ లైఫ్ విషయంలో సమస్యలు ఎదుర్కొంటారు. అయితే ఈ సమస్యను అధిగమించడానికి ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్‌సంగ్ సరికొత్త ఆవిష్కరణకు సిద్ధమైందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సామ్‌సంగ్ కంపెనీ బ్యాటరీ లైఫ్‌ని పెంచడానికి ఎలక్ట్రిక్ వాహనాల సాంకేతికతను ఉపయోగించాలని యోచిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.ముఖ్యంగా కంపెనీ తన తదుపరి ఫోన్ ఎస్ 24 అల్ట్రా నుంచే ఈ సాంకేతికతను అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుందని టెక్ నిపుణుల చెబుతున్నారు. వచ్చే ఏడాది నుంచే ఈ సాంకేతికత అందుబాటులోకి రానుంది. అలాగే బ్యాటరీ పరిశోధన, అభివృద్ధికి బాధ్యత వహించే సంస్థ ఎస్‌డీఐ విభాగం వారి స్మార్ట్‌ఫోన్ వ్యాపారానికి పేర్చబడిన బ్యాటరీలను పరిచయం చేసే అవకాశాన్ని అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. 

బ్యాటరీ రసాయన కూర్పులో మార్పులా కాకుండా ఈ ఆవిష్కరణ బ్యాటరీలోని కణాలను పునర్వ్యవస్థీకరిస్తుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా బ్యాటరీల్లో అధిక శక్తి సాంద్రత ఏర్పడుతుంది. ఇది బ్యాటరీ యొక్క అధిక సామర్థ్యాన్ని అదే వాల్యూమ్‌లో సరిపోయేలా చేస్తుంది. సామ్‌సంగ్ భవిష్యత్ స్మార్ట్‌ఫోన్‌ల బ్యాటరీ లైఫ్‌ను పెంచుతుందని తెలుస్తుంది. ముఖ్యంగా ఆడి క్యూ8 ఈ-టీఆర్ఓఎన్ 114 వాట్ బ్యాటరీను లోపల అమర్చడానికి ఇలాంటి సాంకేతికతను ఉపయోగించిందని నివేదికలు బట్టి తెలుస్తుంది. అయితే స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలు ఎలక్ట్రిక్ వాహనాల పవర్ ప్యాక్‌ల కంటే చాలా భిన్నమైన పరిస్థితులలో పనిచేస్తున్నప్పటికీ, సాంద్రతలో 10 శాతం పెరుగుదల ఉండవచ్చని నివేదిక సూచిస్తుంది. గెలాక్సీ ఎస్ 24 లోనే ఈ సాంకేతికత అందుబాటులోకి రానుంది. ఎస్ 24 తాజా ఎస్ 23 సిరీస్‌ను పోలి ఉంటుంది. అలాగే ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో పని చెస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..