Galaxy Z Flip 4: సామ్‌సంగ్ ఫోల్డబుల్‌ ఫోన్‌పై రూ. 25వేల డిస్కౌంట్‌.. ఫీచర్స్‌ అదుర్స్‌

సామ్‌సంగ్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌ను గతేడాది ఆగస్టులో లాంచ్‌ చేసింది. ఫోన్‌లోను రెండు వేరియంట్స్‌లో లాంచ్‌ చేశారు. Samsung Galaxy Z Flip 4 యొక్క బేస్ వేరియంట్ 8GB RAM, 128GB స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌ ధర రూ. 89,999, కానీ ఇప్పుడు దీనిని రూ. 64,999కి సొంతం చేసుకోవచ్చు. ఇక సెకండ్‌ వేరియంట్‌ 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌...

Galaxy Z Flip 4: సామ్‌సంగ్ ఫోల్డబుల్‌ ఫోన్‌పై రూ. 25వేల డిస్కౌంట్‌.. ఫీచర్స్‌ అదుర్స్‌
Amsung Galaxy Zflip4

Edited By: TV9 Telugu

Updated on: Feb 20, 2024 | 2:48 PM

ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్‌ల హవా నడుస్తోంది. దాదాపు అన్ని స్మార్ట్‌ దిగ్గజ సంస్థలు మార్కెట్లోకి మడతపెట్టే ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే సామ్‌సంగ్‌ గ్యాలక్సీ జెడ్‌ ఫ్లిప్‌4 పేరుతో ఫోన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఏకంగా రూ. 25,000 డిస్కౌంట్‌కు ఈ ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

సామ్‌సంగ్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌ను గతేడాది ఆగస్టులో లాంచ్‌ చేసింది. ఫోన్‌లోను రెండు వేరియంట్స్‌లో లాంచ్‌ చేశారు. Samsung Galaxy Z Flip 4 యొక్క బేస్ వేరియంట్ 8GB RAM, 128GB స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌ ధర రూ. 89,999, కానీ ఇప్పుడు దీనిని రూ. 64,999కి సొంతం చేసుకోవచ్చు. ఇక సెకండ్‌ వేరియంట్‌ 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. రూ. 94,999, కానీ ఇప్పుడు దీనిని రూ. 69,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ను బోరా పర్పుల్, గ్రాఫైట్, పింక్ గోల్డ్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 4 1.9 ఇంచెస్‌ సూపర్ అమోఎల్‌ఈడీ కవర్ డిస్‌ప్లేను అందించారు. 6.7 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ ప్లస్‌ డైనమిక్‌ అమోఎల్‌ఈడీ 2ఎక్స్‌ ఇన్ఫినిటీ డిస్‌ప్లే ఈ ఫోన్‌ సొంతం. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. దీనిలో ప్రధాన కెమెరా సెన్సార్ 12MP, రెండవ కెమెరా సెన్సార్ కూడా 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో తీసుకొచ్చారు.

ఈ ఫోన్ ముందు భాగంలో 10MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఇది కాకుండా ఫోన్ 3700mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 30 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో ఫోన్ 50% ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..