Samsung Galaxy S22 FE: త్వరలో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 ఎఫ్ఈ.. మతిపోయే ఫీచర్లు అదుర్స్…

| Edited By: Anil kumar poka

Dec 27, 2022 | 4:58 PM

శాంసంగ్ త్వరలో ఎస్ 23 మోడల్ ను ఆవిష్కరించే అవకాశం ఉంది. అంతే కాకుండా తన మోడ్సల్ లో ఆదరణ పొందిన ఎస్ 22 లో ఫ్యాన్ ఎడిషన్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఫోన్ ఫిబ్రవరి 1, 2023న యూఎస్ లో లాంచ్ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Samsung Galaxy S22 FE: త్వరలో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 ఎఫ్ఈ.. మతిపోయే ఫీచర్లు అదుర్స్…
Samsung S 22 FE
Follow us on

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ హవా కొనసాగుతుంది. స్మార్ట్ ఫోన్ కంపెనీలు సైతం యువతను ఆకట్టుకోడానికి సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్స్ ను ప్రవేశపెడుతున్నాయి. అదే కోవలో శాంసంగ్ త్వరలో ఎస్ 23 మోడల్ ను ఆవిష్కరించే అవకాశం ఉంది. అంతే కాకుండా తన మోడ్సల్ లో ఆదరణ పొందిన ఎస్ 22 లో ఫ్యాన్ ఎడిషన్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఫోన్ ఫిబ్రవరి 1, 2023న యూఎస్ లో లాంచ్ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  శాంసంగ్ ఇటీవల రద్దు చేసిన ఏ 74 5జీ ఎడిషన్ కు ప్రత్యామ్నాయంగా ఎస్ 22 ఎఫ్ఈ ను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ధర కూడా ఏ సిరీస్ రేంజ్ లోనే ఉంటుందని అంచనా. 

శాంసంగ్ ఎస్ 22 ఎఫ్ఈ స్పెసిఫికేషన్లు

ఈ మొబైల్ కొత్త శాంసంగ్ ప్రాసెసర్, కెమెరా సెన్సార్లతో రానున్నట్లు తెలుస్తోంది. ఇది ఎక్సినోస్ 2300 4 ఎన్ఎం చిప్ సెట్ తో ఉంటుందని అంచనా. అలాగే 108 ఎంపీ బ్యాక్ కెమెరాతో, హెచ్ఎం 6 సెన్సార్ దీని ప్రత్యేకతగా నిలవనుంది. ఈ మొబైల్ 12 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఎస్ 23 మోడల్ కంటే ముందే ఎస్ 22 ఎఫ్ఈతో పాటుగా, శాంసంగ్ ఇయర్ బడ్స్ ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. 

త్వరలో అందుబాటులో గెలాక్సీ ఎఫ్ 14

శాంసంగ్ ఫోన్స్ ప్రజాదరణ కలిగిన గెలాక్సీ ఎఫ్ 14 ను త్వరలో భారత మార్కెట్ లోకి తీసుకురానుంది. జనవరి లో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుందని మార్కెట్ వర్గాల అంచనా. అయితే ఈ ఫోన్ దేశవ్యాప్తంగా అన్ని శాంసంగ్ ఆఫ్ లైన్ స్టోర్లతో పాటు ఫ్లిప్ కార్ట్, శాంసంగ్ వెబ్ సైట్ లో కూడా కొనుగోలు చేసే అవకాశాన్ని వినియోగదారులకు కల్పించనున్నారు. అయితే ఈ ఫోన్ 5 జీ సపోర్ట్ చేస్తుందా? లేదా? అనే విషయం ఇంకా తెలియదు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి