AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio 5G: ఇక గ్రామీణ ప్రాంతాలే టార్గెట్‌.. జియో వైర్‌లెస్‌ 5 జీ విస్తృత సేవలతో మన ముందుకు

ఇప్పటి వరకూ మొబైల్‌ ద్వారా ఇంటర్నెట్‌ సేవలను అందించిన జియో ఇప్పుడు వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ సేవలను కూడా జియో ఫైబర్‌ ద్వారా అందిస్తుంది. రిలయన్స్ జియో తన 5జీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ సర్వీస్, జియో ఎయిర్‌ఫైబర్ సేవలను టైర్ -3, టైర్ -4, గ్రామీణ మార్కెట్‌లో లాంచ్‌ చేయనుంది. ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా పెద్ద నగరాల్లో జియో విస్తృత సేవలు అందిస్తుంది. జియోఎయిర్‌ఫైబర్ ప్రారంభించిన వెంటనే  టైర్ 3 లేదా టైర్ 4 పట్టణాల్లో అనూహ్య డిమాండ్‌ ఏర్పడింది.

Jio 5G: ఇక గ్రామీణ ప్రాంతాలే టార్గెట్‌.. జియో వైర్‌లెస్‌ 5 జీ విస్తృత సేవలతో మన ముందుకు
Jio Air Fiber
Nikhil
|

Updated on: Jan 24, 2024 | 8:30 AM

Share

ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్‌ వాడకం తారాస్థాయికు చేరింది. టెలికాం రంగంలో జియో ఎంట్రీతో భారతదేశంలో ఇంటర్నెట్‌ వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఇప్పటి వరకూ మొబైల్‌ ద్వారా ఇంటర్నెట్‌ సేవలను అందించిన జియో ఇప్పుడు వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ సేవలను కూడా జియో ఫైబర్‌ ద్వారా అందిస్తుంది. రిలయన్స్ జియో తన 5జీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ సర్వీస్, జియో ఎయిర్‌ఫైబర్ సేవలను టైర్ -3, టైర్ -4, గ్రామీణ మార్కెట్‌లో లాంచ్‌ చేయనుంది. ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా పెద్ద నగరాల్లో జియో విస్తృత సేవలు అందిస్తుంది. జియోఎయిర్‌ఫైబర్ ప్రారంభించిన వెంటనే  టైర్ 3 లేదా టైర్ 4 పట్టణాల్లో అనూహ్య డిమాండ్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో సేవలను మరింత విస్తృతపరచాలని జియో అనుకుంటుంది.

జియో ఎయిర్‌ ఫైబర్‌, జియో ఫైబర్‌తో పోలిస్తే టెలికాం ద్వారా ఇంటర్నెట్‌ వినియోగం అధికంగా ఉంటుంది. అయితే ఇప్పుడు స్పీడ్‌ను మరింత పెంచి దేశవ్యాప్తంగా ఎయిర్‌ఫైబర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. జియో, ఎయిర్‌టెల్ తమ 5జీ ఎఫ్‌డబ్ల్యూఏ సేవలను ఢిల్లీ, ముంబై వంటి ఎంపిక చేసిన మెట్రో నగరాల్లో ప్రారంభించాయి. క్రమంగా కవరేజీనివిస్తరించాయి. జియో ఎయిర్‌ఫైబర్‌ ప్లాన్‌ల ధర రూ. 599, రూ. 899, రూ. 1,199, ఇవి 14 ఓవర్-ది-టాప్ (ఓటీటీ) కంటెంట్ అప్లికేషన్‌లతో పాటు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ జియో సినిమా ప్రీమియంలకు యాక్సెస్‌ను అందిస్తాయి.

జియో తన దేశవ్యాప్త 5జీ రోల్‌అవుట్‌ను పూర్తి చేసిందని మరియు 90 మిలియన్ల మంది కస్టమర్‌లు దాని 5జీ మొబైల్ నెట్‌వర్క్‌కు మారారని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. పరిమాణాత్మక ప్రాతిపదికన పాన్-ఇండియా ప్రాతిపదికన జియోకు సంబంధించిన 5జీ లభ్యత దాని సమీప పోటీదారు కంటే దాదాపు మూడు రెట్లుగా ఉంది. మొత్తం డౌన్‌లోడ్ వేగం పరంగా నెట్‌వర్క్ దాని కంటే దాదాపు రెండు రెట్లు వేగంగా ఉంది. మిగిలిన పోటీలో దాదాపు 3 శాతం తగ్గుదల కనిపించగా, జియో తన సబ్‌స్క్రైబర్ బేస్‌లో దాదాపు 7.5 శాతం పెరుగుదలను చూపించింది.

ఇవి కూడా చదవండి

ఎంటర్‌ప్రైజెస్, చిన్న, మధ్యతరహా వ్యాపారాలను విస్తరించి ఉన్న కస్టమర్‌లకు సలహాలు, అమలుతో పాటు వారికి అవసరమైన మొత్తం డిజిటల్ సేవల నిర్వహణలో జియో సహాయం చేయడానికి ప్రయత్నిస్తోందని జియో ప్రతినిధులు పేర్కొంటున్నారు. లైక్-టు-లైక్ ప్రాతిపదికన గత సంవత్సరం కంటే, రాబడులు 1.3 రెట్లు పెరిగాయని పేర్కొంటున్నారు. జియో తన టాప్ 100 ఖాతాల నుండి లైక్-టు-లైక్ ప్రాతిపదికన 30 శాతం వృద్ధిని సాధించిందని ఆయన అన్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..