Social media ban: ఆస్ట్రేలియాలో సోషల్ మీడియాపై ఆంక్షలు.. మినిమమ్ ఏజ్ విధింపు

|

Nov 08, 2024 | 6:30 PM

ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా నేడు అత్యంత ఆదరణ పొందింది. వార్తలు, విశేషాలు, విచిత్ర సంఘటనలతో పాటు పుకార్లు, అబద్దాలు కూడా దీనిలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను విపరీతంగా వినియోగిస్తున్నారు. అయితే దాన్ని వల్ల పిల్లలు పాడైపోతున్నారని, ముఖ్యంగా వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Social media ban: ఆస్ట్రేలియాలో సోషల్ మీడియాపై ఆంక్షలు.. మినిమమ్ ఏజ్ విధింపు
Social Media
Follow us on

ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా కొత్త చట్టం తీసుకురానుంది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ ఇటీవల వెల్లడించారు. టెక్ దిగ్గజాలు వివిధ రకాల ఆన్ లైన్ కంటెంట్ ను సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నాయి. వయో పరిమితి నిబంధన విధించడం వల్ల ఆ కంటెంట్ కు అవి జవాబుదారీగా ఉంటాయి. ఆస్ట్రేలియా తీసుకురానున్న కొత్త చట్టం వెనుక ప్రధాన ఉద్దేశం ఇదే. ఎందుకంటే తప్పుడు సమాచారం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి. చిన్న వయసు పిల్లలకు మానసిక పరిపక్వత లేకపోవడంతో వాటి ప్రభావానికి లోనవుతున్నారు.

ఈ ఏడాది నవంబర్ 18న ప్రారంభమయ్యే రెండు వారాల సెషల్ లో ఈ చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నారు. దాన్ని ఆమోదించిన 12 నెలల తర్వాత అమల్లోకి తీసుకురానున్నారు. ఎక్స్, టిక్ టాక్, ఫేస్ బుక్ తదితర ప్లాట్ ఫాంలను 16 కంటే తక్కువ వయసున్న వారు వాడకుండా నియంత్రించడానికి కి ఏడాది పాటు సూచనలు, సలహాలు తీసుకుంటారు. కొత్త చట్టం ప్రకారం 16 ఏళ్ల లోపు సోషల్ మీడియాను ఫాలో కాకుండా ఆయా ప్లాట్ ఫాంలు చర్యలు తీసుకోవాలి. లేకపోతే వాటికి జరిమానా విధిస్తారు. కానీ తక్కువ వయసు గల పిల్లలు, వారి తల్లిదండ్రులపై చర్యలు ఉండవు. కాబట్టి యాక్సెస్ నిరోధానికి ప్లాట్ ఫాంలు సహేతుమైన చర్యలు తీసుకోవాలి. అలాగే సిడ్నీలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన వీడియోను తొలగించడంలో ప్లాట్ ఫాం విఫలమైనందుకు ప్రభుత్వం ఇటీవల ఎలోన్ మస్ కు చెందిన ఎక్స్ కార్ప్ ను కోర్టులో సవాలు చేసింది.

ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాలలో కూడా ఈ అంశంపై అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఫ్రాన్స్ లో 15 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల సమ్మతి అవసరం. 13 ఏళ్ల లోపు పిల్లలు స్మార్ట్ ఫోన్ వాడకూడదు. టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ వినియోగించే 18 ఏళ్ల లోపు వారిపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. యూకేలో కూడా 16 ఏళ్లు పైబడిన వారు స్మార్ట్ ఫోన్ అమ్మకాలను పరిమితం చేసే చట్టాలను కూడా తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..