విడుదలైన రెడ్‌మీ నూతన ల్యాప్‌టా‌ప్‌లు.. ఆగస్టు 6 నుంచి అందుబాటులోకి.. ధర ఎంతంటే?

|

Aug 03, 2021 | 2:10 PM

Redmi Book 15 Series: ప్రముఖ స్మార్ట్​ఫోన్ తయారీ సంస్థ షియోమీ మంగళవారం తన తొలి రెడ్​మీ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. స్మార్ట్‌ఫోన్లలో తన సత్తా చాటిన ఈ సంస్థం తాజాగా ల్యాప్‌టాప్‌ల విభాగంలోకి ఎంటరైంది.

విడుదలైన రెడ్‌మీ నూతన ల్యాప్‌టా‌ప్‌లు.. ఆగస్టు 6 నుంచి అందుబాటులోకి.. ధర ఎంతంటే?
Redmibook 15 Series
Follow us on

RedmiBook 15 Series: ప్రముఖ స్మార్ట్​ఫోన్ తయారీ సంస్థ షియోమీ మంగళవారం తన తొలి రెడ్​మీ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. స్మార్ట్‌ఫోన్లలో తన సత్తా చాటిన ఈ సంస్థం తాజాగా ల్యాప్‌టాప్‌ల విభాగంలోకి ఎంటరైంది. షియోమీ సంస్థ ‘రెడ్‌ మీ బుక్‌’ పేరుతో రెండు మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 11వ జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్‌లతోపాటు 8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌తో విడులయ్యాయి. రెడ్‌మీ బుక్ 15 సిరీస్‌లో భాగంగా వీటిని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

రెడ్‌ మీ బుక్‌ ఫీచర్స్‌..
ఇందులో 15.6 అంగుళాల స్క్రీన్‌ సైజ్‌, 1920*1080 పిక్సెల్స్‌ రెజెల్యూషన్‌తో ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే అందించారు. వెబ్‌ క్యామ్‌ కోసం లైట్‌ బెజెల్స్‌ను ఏర్పాటు చేశారు. డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, సీ టైప్‌ 3.1యూఎస్‌బీ, వీ 5.0 బ్లూటూత్‌, యూఎస్‌బీ టైప్‌ -ఏ, ఆడియో జాక్‌, యూఎస్‌ బీ 2.0, రెండు స్టెరో స్పీకర్స్‌ లాంటి ఫీచర్లతో విడుదలయ్యాయి. కాగా ఈ ల్యాప్‌టాప్స్ త్వరలో విడుదలయ్యే విండోస్ 11కు అప్‌గ్రేడ్‌లా రూపొందించినట్లు కంపెనీ ప్రకటించింది.

అలాగే ఇంటెల్‌ 11వ జనరేషన్‌ లో వాడే ఐ3, ఐ5 ప్రాసెసర్‌‌తో పనిచేస్తాయి. 8జీబీ ర్యామ్‌, 512జీబీ స్టోరేజ్‌తో వీటిని విడుదల చేశారు. 65 watts ఛార్జర్‌తో అందించారు. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్‌ పెడితే దాదాపు 10 గంటల పాటు వాడుకోవచ్చని సంస్థ ప్రకటించింది.

ధర
రెడ్‌మీ బుక్ ప్రో, రెడ్‌మీ ఈ లెర్నింగ్ ఎడిషన్‌లో భాగంగా విడుదలైన ఈ ల్యాప్‌టాప్స్ ధరలను కూడా సంస్థ ప్రకటించింది. వీటి ధరను రూ.39,499 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో రెడ్‌మీ బుక్ 15 ప్రో రూ. 46,499 గా ఉండగా, రెడ్‌మీ బుక్ 15 ఈ లెర్నింగ్ ఎడిషన్ ధర రూ. 39,499గా నిర్ణయించారు. ఇవి ఆగస్టు 6 నుంచి యూజర్లకు అందుబాటులోకి రానున్నాయని సంస్థ తెలిసింది. వీటిని ఫ్లిప్ కార్ట్, ఎం.కాం నుంచి కొనుగోలు చేయవచ్చని తెలిపింది.

Also Read:  Realme: ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల ఎగుమతి భారత్ వంతు.. ఇతర దేశాలకు మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు

Mobile‌ Explosion: మొబైల్ ఫోన్స్ ఎందుకు పేలుతాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి..?

Google Pixel 6: పిక్సెల్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. భారత్‌లో ఈ ఫోన్లు..?