అతి తక్కువ ధరలో… లేటెస్ట్ ఫీచర్స్ తో…

| Edited By:

Oct 09, 2019 | 2:45 PM

భారత స్మార్ట్ ఫోన్ రంగంలో నంబర్ వన్ అయిన షావోమి మార్కెట్లోకి మరో బడ్జెట్ మొబైల్ ను తీసుకువచ్చింది. ఈ సంవత్సరం మార్చిలో ఆ సంస్థ విడుదల చేసిన రెడ్ మీ 7కు తర్వాతి వెర్షన్ అయిన రెడ్ మీ 8 నేడు(అక్టోబర్ 9) భారత మార్కెట్లోకి వచ్చేసింది. వివరాల్లోకెళితే … రెడ్ మీ 8 మొబైల్ లో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఇందులో 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.7,999గానూ, […]

అతి తక్కువ ధరలో... లేటెస్ట్ ఫీచర్స్ తో...
Follow us on

భారత స్మార్ట్ ఫోన్ రంగంలో నంబర్ వన్ అయిన షావోమి మార్కెట్లోకి మరో బడ్జెట్ మొబైల్ ను తీసుకువచ్చింది. ఈ సంవత్సరం మార్చిలో ఆ సంస్థ విడుదల చేసిన రెడ్ మీ 7కు తర్వాతి వెర్షన్ అయిన రెడ్ మీ 8 నేడు(అక్టోబర్ 9) భారత మార్కెట్లోకి వచ్చేసింది. వివరాల్లోకెళితే …

రెడ్ మీ 8 మొబైల్ లో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఇందులో 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.7,999గానూ, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8,999గానూ నిర్ణయించారు. ఈ ఫోన్ ఓఎన్ వైఎక్స్ బ్లాక్, రూబీ రెడ్, సాఫైర్ బ్లూ రంగుల్లో మార్కెట్లోకి రానుంది.

అయితే షావోమి తాజాగా 100 మిలియన్ల స్మార్ట్ ఫోన్ల విక్రయించిన మార్కును చేరుకోవడం, భారత మార్కెట్లో వరుసగా ఎనిమిదో త్రైమాసికంలో కూడా షావోమినే నంబర్ వన్ గా నిలవడంతో ఎంఐ అభిమానుల కోసం రెడ్ మీ 8 స్మార్ట్ ఫోన్ లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ వేరియంట్ లో మొదటిగా అమ్ముడయ్యే 50 లక్షల మొబైళ్లను రూ.7,999కే విక్రయించనున్నారు. దీనికి సంబంధించిన మొదటి సేల్ అక్టోబర్ 12న అర్థరాత్రి 12:01 నిమిషాలకు ఫ్లిప్ కార్ట్, ఎంఐ.కామ్, ఎంఐ హోంలో జరగనుంది.

రెడ్ మీ 8లో 6.22 అంగుళాల టచ్ స్క్రీన్ అందుబాటులో ఉంది. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసర్ ను అందించారు. వెనకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగా పిక్సెల్ కాగా, సోనీ ఐఎంఎక్స్363 సెన్సార్ ను ఇందులో ఉపయోగించారు. దీని అపెర్చర్ f/1.8గా ఉంది. ఇక 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో కెమెరాను డెప్త్ సెన్సార్ గా ఉపయోగించారు. ఏఐ సామర్థ్యమున్న 8 మెగా పిక్సెల్ కెమెరాను సెల్ఫీ కెమెరాగా అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ కాగా 18W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఇది సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం పెరగడానికి ఇందులో కొన్ని ఏఐ సంబంధిత మార్పులు చేసినట్లు సంస్థ ప్రతినిధులు లాంచ్ సందర్భంగా వివరించారు. ఇందులో ఫోన్ తో పాటు 10W సామర్థ్యమున్న చార్జర్ ను ఇందులో అందించారు. ఇందులో ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్ లాక్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9 Pie ఆధారిత ఎంఐయూఐ ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది.