Redmi 13C: జియోమీ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. స్పెక్స్, ఫీచర్లు, ధర..

| Edited By: Shaik Madar Saheb

Nov 13, 2023 | 9:57 PM

ప్రపంచ వ్యాప్తంగా జియోమీ ఫోన్లకు మంచి డిమాండే ఉంది. ఆ డిమాండ్ కు అనుగుణంగా కంపెనీ కొత్త కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తూనే ఉంది. ఇటీవలే రెడ్ మీ 12సీ పేరుతో కొత్త ఫోన్ లాంచ్ చేయగా.. అది ఇంచుమించు పోకో సీ65 వంటి స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుంది. ఇదే క్రమంలో మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. రెడ్ మీ 13సీ పేరుతో దీనిని ఆవిష్కరించింది. ఇది సరికొత్త స్పెసిఫికేషన్లతో అందుబాటులోకి వచ్చింది.

Redmi 13C: జియోమీ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. స్పెక్స్, ఫీచర్లు, ధర..
Redmi 13c
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా జియోమీ ఫోన్లకు మంచి డిమాండే ఉంది. ఆ డిమాండ్ కు అనుగుణంగా కంపెనీ కొత్త కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తూనే ఉంది. ఇటీవలే రెడ్ మీ 12సీ పేరుతో కొత్త ఫోన్ లాంచ్ చేయగా.. అది ఇంచుమించు పోకో సీ65 వంటి స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుంది. ఇదే క్రమంలో మరో కొత్త ఫోన్ ను రెడ్ మీ లాంచ్ చేసింది. రెడ్ మీ 13సీ పేరుతో దీనిని ఆవిష్కరించింది. ఇది సరికొత్త స్పెసిఫికేషన్లతో అందుబాటులోకి వచ్చింది. ఈ రెడ్మీ 13సీ ఫోన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

రెడ్ మీ 13సీ స్పెసిఫికేషన్లు..

ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్లో 6.74 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లే ఉంటుంది. 90హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 450నిట్స్ పీక్ బ్రయట్ నెస్ ఉంటుంది. వాటర్ డ్రాప్ నాట్చ్ ను కలిగి ఉంటుంది. ఇది మీడియా టెక్ హీలియో జీ 85 ఎస్ఓసీ, మాలి జీ52 జీపీయూ ద్వారా పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్తో పాటు మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది.

కనెక్టివిటీ విషయానికి వస్తే డ్యూయల్ సిమ్, 4జీ, వైఫై, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, గ్లోనాస్, గలిలియో వంటి ఫీచర్లు ఉంటాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఫోన్ వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 2ఎంపీ మాక్రో లెన్స్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 8ఎంపీ కెమెరా ఉంటుంది. వీటి సాయంతో మంచి క్వాలిటీతో కూడిన చిత్రాలను తీయొచ్చు.

రెడ్ మీ 13సీ ధర..

ప్రస్తుతం ఈ ఫోన్ నైజీరియాలో విక్రయాలను సిద్ధంగా ఉంది. అక్కడ 4జీబీ ర్యామ్ వేరియంట్ ధర నైరా 98,100గా ఉంది. అది మన కరెన్సీలో రూ. 10,200గా ఉంటుంది. అదే 6జీబీ వేరియంట్ ధర నైరా 108,100, అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 11,200గా ఉంటుంది. అదే 8జీబీ ర్యామ్ వేరియంట్ అయితే మన దగ్గర రూ. 12,500 వరకూ ఉంటుంది. ఇది నాలుగు విభిన్న రంగులు గ్లేసియర్ వైట్, క్లోవర్ గ్రీన్, మిడ్ నైట్ బ్లాక్, నేవీ బ్లూ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇది మన దేశంలో కూడా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కంపెనీ ప్రకటించింది.

 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..