Realme watch 3 pro: రియల్‌మీ నుంచి అదిరిపోయే స్మార్ట్ వాచ్ వచ్చేసింది.. ఆఫర్‌లో భాగంగా రూ. 2వేలు డిస్కౌంట్..
Realme watch 3 pro: ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ వాచ్‌ల సందడి కొనసాగుతోంది. పండుగ సీజన్‌ను టార్గె్ట్ చేస్తూ కంపెనీలు వాచ్‌లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ ధరలో అన్నిరకాల ఫీచర్లతో కూడిన వాచ్‌లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకునే...
Realme watch 3 pro: ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ వాచ్‌ల సందడి కొనసాగుతోంది. పండుగ సీజన్‌ను టార్గె్ట్ చేస్తూ కంపెనీలు వాచ్‌లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ ధరలో అన్నిరకాల ఫీచర్లతో కూడిన వాచ్‌లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి కంపెనీలు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం రియల్‌మీ కొత్తగా రియల్‌మీ వాచ్ 3 ప్రో పేరుతో కొత్త స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్ వాచ్ స్పెసిఫికేషన్స్‌పై మీరూ ఓ లుక్కేయండి..
రియల్‌మీ వాచ్ 3 ప్రో స్మార్ట్‌వాచ్‌లో 1.78 ఇంచెస్ అమోఎల్‌ఈడీ హెచ్‌డీ కర్వ్డ్ డిస్‌ప్లేను అందించారు. ఇందులో GPS, Cywee GPS పొజిషనింగ్ అల్గారిథమ్ వంటి అధునాతన ఫీచర్‌ను అందించారు. ఇక బ్లూటూత్ సహాయంతో ఫోన్‌ను మాట్లాడుకునేందుకు వీలుగా బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్‌ను ఇచ్చారు. ఇందులో భాగంగా వాయిస్ క్లారిటీ కోసం స్మార్ట్ పవర్ యాంప్లిఫైయర్‌ను ప్రత్యేకంగా అందించారు. 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లు, 110కి పైగా స్పోర్ట్స్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ మోడ్‌లు ఈ వాచ్ సొంతం.
అలాగే హెల్త్ ఫీచర్లలో భాగంగా హార్ట్‌బీట్ సెన్సార్, SpO2 ట్రాకర్, విట్/హెచ్ స్లీప్‌తో పాటు స్ట్రెస్ ట్రాకర్, ఫిమేల్ హెల్త్ ట్రాకర్ వంటి ఆప్షన్స్‌ను అందించారు. ఈ స్మార్ట్‌వాచ్‌లో 345 mAh బ్యాటరీని అందించారు. వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు. ఇక ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 6,999, కాగా లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ. 4,999కి అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా అదనంగా ఐదు శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..