- Telugu News Photo Gallery Technology photos Dizo launches two new smart watches Dizo watch r talk and watch d talk features and price Telugu Tech News
Dizo Watch r Talk: డిజో నుంచి కొత్త స్మార్ట్ వాచ్‌లు.. బ్లూటూత్ కాలింగ్‌తో పాటు మరెన్నో ఫీచర్లు..
Dizo Watch r Talk: డిజో కంపెనీ తాజాగా భారత మార్కెట్లోకి రెండు కొత్త స్మార్ట్ వాచ్‌లను లాంచ్ చేసింది. రెండు వాచ్‌ల్లో ఒకేరకమైన ఫీచర్లు ఉన్నప్పటికీ స్క్రీన్‌లో తేడాలు ఇచ్చారు. సెప్టెంబర్ 13 నుంచి సేల్ ప్రారంభం కానున్న ఈ వాచ్ ధరల, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Sep 11, 2022 | 5:34 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం డిజో తాజాగా భారత మార్కెట్లోకి డిజో వాచ్ ఆర్ టాక్, వాచ్ డి టాక్ పేరుతో రెండు కొత్త స్మార్ట్ వాచ్‌లను లాంచ్ చేసింది. నిజానికి ఈ రెండు వాచ్‌లలో ఫీచర్లు ఒకేలా ఉన్నా.. ఆర్ టాక్ వాచ్ రౌండ్, డీ టాక్ స్క్వేర్ షేప్‌లో ఉంది.

ఇక డిజో వాచ్ ఆర్ టాక్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.3 ఇంచెస్ అమోఎల్‌ఈడీ రౌండ్ స్క్రీన్‌ను అందించారు. 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 360x360 రిజల్యూషన్‌ను కలిగి ఉంది.

బ్లూటూత్ కాలింగ్ ఈ స్మార్ట్ వాచ్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. క్లారిటీ ఆడియా కోసం నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను ఇచ్చారు. బ్యాటరీ విషయానికొస్తే 300 mAh బ్యాటరీని ఇచ్చారు, కాల్ ఫీచర్ లేకుండా 10 రోజుల వరకు, కాలింగ్ ఫీచర్‌తో ఐదు రోజుల వరకు బ్యాటరీ పని చేస్తుంది.

ఇక హెల్త్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో SpO2 మానిటర్, బ్లడ్ ప్రెజర్ మానిటర్, రియల్ టైమ్ హార్ట్ రేట్ ట్రాకర్ వంటి వాటిని అందించారు. ఐపీ68 రేటింగ్‌తో వాటర్ ప్రూఫ్ అందించారు.

150 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లు, 110 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడల్స్‌తో కూడిన ఈ వాచ్ అసలు ధర రూ. 4,999 కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 3,799కి అందుబాటులో ఉంది.




