- Telugu News Photo Gallery Technology photos Thomson launching smart tvs in indian market Thomson LED Smart TV features and price details Telugu Tech News
Thomson QLED Smart TV: బడ్జెట్ ధరలో క్యూఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ.. థామ్సన్ నుంచి మూడు వేరియంట్లు..
Thomson QLED Smart TV: థామ్సన్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. క్యూఎల్‌ఈడీ సిరీస్‌లో మొత్తం మూడు వేరియంట్స్ టీవీలను లాంచ్ చేసింది. త్వరలోనే సేల్ ప్రారంభంకానున్న ఈ టీవీ ఫీచర్లు, ధరపై ఓ లుక్కేయండి..
Updated on: Sep 12, 2022 | 11:30 AM

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ థామ్సన్ తాజాగా భారత మార్కెట్లోకి క్యూఎల్‌ఈడీ టీవీలను లాంచ్ చేసింది. 50, 55, 65 ఇంచెస్ వేరియంట్స్‌తో మొత్తం మూడు టీవీలను తీసుకొచ్చింది.

మూడు టీవీలు సైజ్ విషయంలో తేడా ఉన్నప్పటికీ దాదాపు అన్ని టీవీల్లో ఒకే రకమైన ఫీచర్లను అందించారు. ఈ స్మార్ట్ టీవీల్లో 4కే రెజల్యూషన్ స్క్రీన్‌ను అందించారు.

డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10+, హెచ్‌డీఆర్10, HGL టెక్నాలజీకి సపోర్ట్ చేస్తాయి. బెజిల్‌లెస్ డిజైన్‌ను అందించారు. ఇక ఈ స్మార్ట్ టీవీలు మీడియాటెక్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఇచ్చారు.

ఇక ఈ టీవీల్లో 40 వాట్స్ ఔండ్ అవుట్‌పుట్ స్పీకర్లతో పాటు డాల్బీ అట్మోస్, డాల్బీ డిజిటల్ ప్లస్, డీటీఎస్ ట్రూసరౌండ్ సపోర్ట్‌ను అందించారు. ఈ టీవీలు గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయి

ధర విషయానికొస్తే థామ్సన్ క్యూఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ 50 ఇంచెస్ ధర రూ. 33,999, 55 ఇంచెస్ వేరియంట్ ధర రూ. 40,999, 65 ఇంచెస్ టీవీ ధర రూ. 59,999గా ఉంది.




