ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు విషయంలో ప్రాసెసర్, స్టోరేజ్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఛార్జింగ్‌కు కూడా అంతే ప్రయారిటీ ఇస్తున్నారు. వేగంగా ఛార్జింగ్ అయ్యే ఫోన్‌లకు ఇప్పుడు భారీగా డిమాండ్. దీంతో కంపెనీలు సైతం ఇలాంటి పవర్ ఫుల్ బ్యాటరీలతో కూడిన ఫోన్స్‌ను లాంచ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మీ కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఛార్జింగ్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్ కేవలం 8 నిమిషాల్లో 100 శాతం బ్యాటరీ ఫుల్ కావడం విశేషం. ఇంతకీ ఏంటా స్మార్ట్ ఫోన్.? దాని ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రియల్‌మీ జీటీ నియో 5 పేరుతో వచ్చిన ఈ స్మార్ట్ ఫక్షన్‌లో 240 వాట్స్ ఛార్జింగ్ బ్యాటరినీ అందించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఛార్జింగ్ అయ్యే ఫోన్‌గా ఈ ఫోన్‌కు పేరుంది. 4500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీకి 15 వాట్స్ ఛార్జింగ్ స్పీడ్‌తో ఛార్జ్ అవుతుంది. రియల్‌మీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది లాంచ్ చేయనుంది. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేయనుంది. ఇక ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేకపోయినప్పటికీ… ఆన్‌లైన్‌లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
వీటి ప్రకారం.. ఇందులో 6.7 ఇంచెస్ ఓ ఎల్ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ డిస్‌ప్లే ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్స్ రెయిర్ కెమెరాను ఇవ్వనున్నారు. సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. 128 జీబీ స్టోరేజ్‌తో రానున్న ఈ ఫోన్ ధర రూ. 35,000 నుంచి రూ. 40,000 మధ్య ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..