Smart phone: 24 గంటల్లో లక్ష ఫోన్‌లు అమ్ముడుపోయాయి.. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ప్రత్యేకతలు అలాంటివి మరీ..

|

Apr 03, 2023 | 5:08 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీకి ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకురావడంలో రియల్‌మీది పెట్టింది పేరు. ఇక ఈ ఫోన్‌లకు మార్కెట్లో ఉండే క్రేజ్‌ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రియల్‌మీ...

Smart phone: 24 గంటల్లో లక్ష ఫోన్‌లు అమ్ముడుపోయాయి.. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ప్రత్యేకతలు అలాంటివి మరీ..
Smartphone
Follow us on

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీకి ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకురావడంలో రియల్‌మీది పెట్టింది పేరు. ఇక ఈ ఫోన్‌లకు మార్కెట్లో ఉండే క్రేజ్‌ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రియల్‌మీ నుంచి కొత్త ఫోన్‌ వచ్చిందంటే చాలు హాట్‌ కేక్స్‌లా అమ్ముడుపోతుంటాయి. తాజాగా రియల్‌ మీ నుంచి లాంచ్‌ అయిన కొత్త ఫోన్‌ అమ్మకాలు ఈ బ్రాండ్‌ క్రేజ్‌కు ప్రత్యేక నిదర్శనగా చెప్పొచ్చు. రియల్‌మీ తాజాగా సీ55 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

భారత్‌లో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ కోసం యూజర్లు ఒక్కసారిగా ఎగబడ్డారు. రియల్‌మీ సీ55 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ తొలి రోజే రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. భారత్‌లో ఈ ఫోన్‌ను విడుదలైన 24 గంటల్లో ఏకంగా లక్ష ఫోన్‌లు అమ్ముడుపోవడం విశేషం. దీనిబట్టే ఈ ఫోన్‌కు ఎంతటి క్రేజ్‌ ఉందో చెప్పొచ్చు. ఇంతకీ ఇంత పెద్ద సంఖ్యలో ఫోన్‌లు అమ్ముడుపోవడానికి కారణం ఏంటి.? ఇందులో అసలు అంతలా ఉన్న ఫీచర్లు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

రియల్‌మీ సీ55 స్మార్ట్‌ ఫోన్‌లో 6.72 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. మీడియా టెక్‌ హీలియో జీ88 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 5జీ నెట్‌ వర్క్‌కి సపోర్ట్‌ చేస్తుంది. 4GB, 6GB, 8GB RAM ఆప్షన్స్‌తో లాంచ్ అయ్యింది. 64GB, 128GB ఇంటర్నల్ స్టోరేజీ ఇందులో అందించారు. అలానే 1TB వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌కి సపోర్ట్ చేసే డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ఆఫర్ చేశారు. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేసే ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. ధర విషయానికొస్తే.. ఈ ఫోన్‌ రూ.10,999 నుంచి ప్రారంభమవుతుంది. 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999, 6GB RAM+64GB వేరియంట్ ధర రూ. 11,999 కాగా 8GB RAM + 128GB స్టోరేజ్‌తో వచ్చే టాప్-ఎండ్ మోడల్ ధర రూ.13,999గా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..