చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభమైంది. పోకో సీ51 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌ను బడ్జెట్ ధరలో లాంచ్ చేశారు. రూ. 8500లో ఆకర్షణీయమైన ఫీచర్లను అందించారు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలేంటి.? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.52 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 13 గో క్లీన్ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌కు సపోర్ట్ చేసే ఈ ఫోన్‌లో టర్బో ర్యామ్ ఫీచర్‌తో మరో 3జీబీ ర్యామ్ ఉపయోగించుకోవచ్చు. మొత్తం 7జీబీ వరకు ర్యామ్ వాడుకోవచ్చు. కెమెరా విషయానికొస్తే ఇందులో 8మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్ ఉండగా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.
Get yourself a phone with unparalleled power!
POCO C51 goes on sale tomorrow @ 12 noon on @Flipkart. Get yours for just ₹7,799*.
*Special first sale day price pic.twitter.com/JPHKpSRnrG
— POCO India (@IndiaPOCO) April 9, 2023
ఇక ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,499గా ఉంది. స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభమైన తొలిరోజు ఏప్రిల్ 10వ తేదీన రూ.7,799కే అందించారు. రాయల్ బ్లూ, పవర్ బ్లాక్ కలర్స్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ను అందబాటులోకి తీసుకొచ్చారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..