AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Features in Whatsapp : గ్రూప్‌లో జాయిన్ అవ్వాలంటే అనుమతి తప్పనిసరి.. వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్స్..

ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్‌టాప్‌తో సహా దాని అన్ని వెర్షన్‌లలో వినియోగదారుల ఇంటర్‌ఫేస్, గోప్యతను మెరుగుపరచడానికి వాట్సాప్ కొత్త అప్‌డేట్స్ అభివృద్ధి చేస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాబోయే కొన్ని అప్‌డేట్‌లలో కీబోర్డ్ కోసం 21 కొత్త ఎమోజీలు, గ్రూప్ చాట్ అడ్మిన్‌ల కోసం కొత్త ఆమోదం ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది.

New Features in Whatsapp : గ్రూప్‌లో జాయిన్ అవ్వాలంటే అనుమతి తప్పనిసరి.. వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్స్..
Whatsapp
Nikhil
| Edited By: |

Updated on: Mar 14, 2023 | 9:39 AM

Share

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్‌టాప్‌తో సహా దాని అన్ని వెర్షన్‌లలో వినియోగదారుల ఇంటర్‌ఫేస్, గోప్యతను మెరుగుపరచడానికి వాట్సాప్ కొత్త అప్‌డేట్స్‌ను అభివృద్ధి చేస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాబోయే కొన్ని అప్‌డేట్‌లలో కీబోర్డ్ కోసం 21 కొత్త ఎమోజీలు, గ్రూప్ చాట్ అడ్మిన్‌ల కోసం కొత్త ఆమోదం ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ బీటా వినియోగదారుల కోసం 21 కొత్త ఎమోజీలను పరీక్షిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అలాగే గ్రూప్ అడ్మిన్‌లుగా ఉన్న దాని వినియోగదారులను కొత్త వ్యక్తులను ఆమోదించడానికి అనుమతినిచ్చేలా సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్ గ్రూప్ అడ్మిన్‌లకు మరింత నియంత్రణను ఇస్తుంది. 

అందుబాటులోకి ఎమోజీలు

వాట్సాప్ తన ఆండ్రాయిడ్ బీటా వినియోగదారుల కోసం 21 కొత్త ఎమోజీలను పరీక్షిస్తోందని టెక్ నిపుణులు చెబుతన్నారు. ఇప్పుడు ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ కోసం కొత్త ఎమోజీ ప్యాలెట్ అందుబాటులో ఉంది. భవిష్యత్ అప్‌డేట్స్‌లో ఆండ్రాయిడ్ వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కొత్త ఎమోజీలు వాట్సాప్ తాజా యూనికోడ్ 15.0 అప్‌డేట్‌లో భాగంగా ఉంటుదని పేర్కొంటున్నారు. ఇంతకుముందు కొత్త ఎమోజీలు అభివృద్ధిలో ఉన్నందున అధికారికంగా అందుబాటులో లేవు. అయితే ఇప్పుడు వాట్సాప్ తన వినియోగదారుల కోసం అధికారికంగా ఎమోజీలను పరీక్షించి విడుదల చేస్తోంది. కీబోర్డ్‌లోని కొత్త ఎమోజీలతో సహా అన్ని తాజా అప్‌డేట్‌లను పొందడానికి వినియోగదారులు తమ వాట్సాప్ యాప్‌ను అప్‌డేట్‌గా ఉంచుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. 

గ్రూప్ అడ్మిన్ల కోసం ప్రత్యేక ఫీచర్

గ్రూప్ ఇన్‌వైట్ లింక్ ద్వారా గ్రూప్‌లో చేరగలిగే వ్యక్తుల సంఖ్యను పరిమితం చేయాలనుకునే లేదా నియంత్రించే అవకాశం తాజా అప్‌డేట్‌‌తో గ్రూప్ అడ్మిన్లకు లభించనుంది. సెట్టింగ్స్ నుంచి ప్రారంభించిన తర్వాత వాట్సాప్ వినియోగదారులు గ్రూప్ చాట్‌లో కొత్త పార్టిసిపెంట్‌లు గ్రూప్‌లో చేరడానికి అడ్మిన్ నుంచి అనుమతిని కోరుతున్నట్లు ప్రాంప్ట్ చేసే సందేశాన్ని చూస్తారు. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలో అందరికీ విడుదల కానుంది. అందుబాటులోకి వచ్చిన తర్వాత, వినియోగదారులు గ్రూప్ సెట్టింగ్‌లలో కొత్త గ్రూప్ సెట్టింగ్‌లను కనుగొంటారు, ఇక్కడ ‘కొత్త పార్టిసిపెంట్‌లను ఆమోదించండి’ అనే ఎంపిక అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం

Follow Us
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?