TikTok Pakistan: మరోసారి టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేసిన పాకిస్థాన్‌.. రెండేళ్లలో ఇది నాలుగో సారి.. కారణమేంటంటే..

TikTok Pakistan: ప్రముఖ వీడియో షేరింగ్ యాప్‌ టిక్‌టాక్‌ ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. అయితే అదే సమయంలో ఈ యాప్‌ వివాదాన్ని కూడా మూటకట్టుకుంది. ప్రపంచంలోని పలు...

TikTok Pakistan: మరోసారి టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేసిన పాకిస్థాన్‌.. రెండేళ్లలో ఇది నాలుగో సారి.. కారణమేంటంటే..
Tiktok Banned

Edited By: Subhash Goud

Updated on: Jul 22, 2021 | 9:12 AM

TikTok Pakistan: ప్రముఖ వీడియో షేరింగ్ యాప్‌ టిక్‌టాక్‌ ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. అయితే అదే సమయంలో ఈ యాప్‌ వివాదాన్ని కూడా మూటకట్టుకుంది. ప్రపంచంలోని పలు దేశాల్లో టిక్‌టాక్‌పై నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయన్న విషయం తెలిసిందే. ప్రముఖంగా భారత్‌లో టిక్‌టాక్‌ సేవలు నిలిచి పోయి ఏడాది గడుస్తోంది. భారత్‌లో టిక్‌టాక్‌తో పాటు చైనాకు చెందిన పలు యాప్‌లను బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పాకిస్థాన్‌ కూడా టిక్‌టాక్‌పై నిషేధాన్ని విధించింది. అయితే పాకిస్థాన్‌ టిక్‌టాక్‌ను నిషేధించడం ఇది నాలుగో సారి కావడం గమనార్హం. పాకిస్థాన్‌ గడిచిన రెండేళ్లలో టిక్‌టాన్‌ను నాలుగు సార్లు బ్యాన్‌ చేసింది.

టిక్‌టాక్‌లో అభ్యంతకరమైన కంటెంట్‌ కనిపిస్తున్నా సంస్థ నియంత్రించడంలో విఫలమైందని అందుకనే నిషేధం విధిస్తున్నట్లు పాకిస్థాన్‌ తెలిపింది. గతంలో పాకిస్థాన్‌ టిక్‌టాను మూడు సార్లు తాత్కాలికంగా నిషేధించింది. అయితే నిషేధం విధించిన ప్రతిసారి.. ఇకపై అలాంటి కంటెంట్‌ను నియంత్రిస్తామని టిక్‌టాక్ యాజమాన్యం చెప్పడంతో పాకిస్తాన్ ఆ నిషేధాన్ని తొలగించింది. అయినా టిక్‌టాక్‌ తీరులో మార్పు రాకపోవడంతో మరోసారి నిషేధాన్ని విధించింది. తొలిసారి పాకిస్థాన్‌ 2020 అక్టోబర్‌లో టిక్‌టాక్‌ను నిషేధించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పాకిస్థాన్‌లో టిక్‌టాక్‌కు మూడు కోట్ల మంది యూజర్లు ఉండడం విశేషం. ఇదిలా ఉంటే భారత్‌లో నిషేధానికి గురైన టిక్‌టాక్‌ మళ్లీ వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి పేరు మార్చుకొని రానున్నట్లు సమాచారం. ‘TikTok’గా ఉన్న ఈ వీడియో యాప్ పేరు భారత్‌లో ‘TickTock’ గా మారబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ కొత్త పేరుపై ట్రేడ్‌మార్క్ కోసం టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్ దరఖాస్తు చేసుకుంది.

Also Read: Walking: వ్యాయామం కంటే చురుకైన నడక వృద్ధులలో జ్ఞాపకశక్తిని పెంచుతుంది..తాజా పరిశోధనల్లో వెల్లడి 

ఆమె దయాగుణం లేని విషకన్య..! అందమే ఆమె ఆయుధం.. వలపు వల విసిరిందంటే విలవిలలాడాల్సిందే..

5 Paise Biryani: 5 పైసలకే వేడివేడిగా నోరూరించే బిర్యానీ.. ఎగబడ్డ జనం.. షట్టర్లు బంద్