Oxygen: ప్రాణవాయువును అందించే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు..ఎలా పనిచేస్తాయి..ఇవి ఇచ్చే ఆక్సిజన్ ఎంత ఉపయోగకరం..

|

Apr 30, 2021 | 7:13 PM

కరోనా వైరస్ రెండో వేవ్ కనీ వినీ ఎరుగని విధంగా దాడి చేస్తోంది. ఒక్కసారిగా విరుచుకుపడిన ఈ వేవ్ ను భారతావని తట్టుకోలేక పోతోంది. అన్నిరకాల ఇబ్బందులూ ఎదుర్కుంటోంది.

Oxygen: ప్రాణవాయువును అందించే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు..ఎలా పనిచేస్తాయి..ఇవి ఇచ్చే ఆక్సిజన్ ఎంత ఉపయోగకరం..
Oxygen Concentrator
Follow us on

Oxygen: కరోనా వైరస్ రెండో వేవ్ కనీ వినీ ఎరుగని విధంగా దాడి చేస్తోంది. ఒక్కసారిగా విరుచుకుపడిన ఈ వేవ్ ను భారతావని తట్టుకోలేక పోతోంది. అన్నిరకాల ఇబ్బందులూ ఎదుర్కుంటోంది. ఒక పక్క ఆసుపత్రుల్లో బెడ్ల కొరత.. మరోవైపు మందుల లభ్యత లేకపోవడం.. ఇక విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను నిలబెట్టే ఆక్సిజన్ లభించకపోవడం. నిజానికి మన దేశంలో ఆక్సిజన్ అవసరానికి మించి ఉత్పత్తి చేస్తూ ఉంటారు. కానీ, ఈ విపత్కర పరిస్థితుల్లో ఒక్కసారిగా పెరిగిన డిమాండ్ తో ఆక్సిజన్ నిల్వలు కావలసినంత దొరకటం లేదు. ఈ నేపధ్యంలో పలు దేశాలు భారతదేశం కోసం మేమున్నాం అంటూ ముందుకు వచ్చాయి. ఈ ప్రపంచ దేహ్సాలు ఎక్కువగా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను మనదేశానికి అందచేస్తున్నాయి. కరోనా విరుచుకుపడుతున్న తరుణంలో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ఇప్పడు సంజీవనులుగా మారాయి. అసలు కాన్సన్‌ట్రేటర్లు ఎందుకు ఉపయోగపడతాయి? ఇవి ఏమి చేస్తాయి? స్వచ్చమైన ప్రాణవాయువును అందిస్తాయా వంటి ప్రశ్నలు కలగడం సహజం. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కాన్సన్‌ట్రేటర్ల గురించి తెలుసుకునే ముందు మన శరీరం ఆక్సిజన్ ఎలా తీసుకుంటుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. మనం ఊపిరి పీల్చుకునే సమయంలో గాలిలో పూర్తి ఆక్సిజన్ ఉండదు. అందులో 78 శాతం నైట్రోజన్ ఉంటుంది. మిగిలిన 21 శాతం ఆక్సిజన్ ఉంటుంది. మన శరీరంలోకి ఈ గాలి ముక్కు, శ్వాసనాళాల ద్వారా వెళ్ళిన తరువాత, ఊపిరితిత్తుల్లో ఈ గాలి వదగోట్టడం జరుగుతుంది. ఈ వడబోత తరువాత ఆక్సిజన్ మన శరీరానికి అందుతుంది.. మిగిలిన వాయువులు మళ్ళీ ముక్కు ద్వారా బయటకు నెట్టివేయబడతాయి. సరిగ్గా ఇదే విధంగా ఈ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు పనిచేస్తాయి. ఈ వైద్య పరికరం.. గాలిలోని ఆక్సిజన్ ను విడదీసి నేరుగా పేషెంట్స్ కు గొట్టాల ద్వారా అందిస్తుంది. ఈ యంత్రాలలో ఉండే జల్లెడ వంటి పరికరాలు నిరంతరాయంగా పని చేసి.. నిమిషానికి 10 లీటర్ల ఆక్సిజన్ ను 95 శాతం స్వచ్చతతో మనకు అందిస్తాయి. అలాగే వ్యర్ధ వాయువులను బయటకు విడిచిపెడతాయి.

ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల గురించి కొన్ని విషయాలు

  • మార్కెట్లో ఇప్పుడు నిమిషానికి 5, 8, 10 లీటర్ల ఆక్సిజన్ అందించే కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉన్నాయి.
  • కరోనా వ్యాప్తికి ముందు నిమిషానికి 5 లీటర్ల ఆక్సిజన్ అందించే కాన్సన్‌ట్రేటర్ల ఖరీదు 40 వేల నుంచి 50 వేలవరకూ కంపెనీని బట్టి ఉండేది.
  • కానీ, ఇప్పుడు దీని ఖరీదు దాదాపు 50 శాతం పెరిగింది. 60 వేల నుంచి 70 వేల వరకూ ఇప్పుడు ఖర్చు అవుతుంది.
  • ఆక్సిజన్ సిలెండర్లు కొంత మొత్తం ఆక్సిజన్ తో (దాని కెపాసిటీని బట్టి) ఉంటాయి. వాటిని రీఫిల్ చేయించుకోవాల్సి ఉంటుంది.
  • కానీ, కాన్సన్‌ట్రేటర్లతో ఆ సమస్య ఉండదు. ఇవి గాలి నుంచి ఆక్సిజన్ ను తాయారు చేసే యంత్రాలు కాబట్టి నిరంతరాయంగా ఆక్సిజన్ అందించగలవు.
  • ఇవి కరెంట్ తో పనిచేస్తాయి. కనుక, విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది.
  • ఆక్సిజన్ మరీ ఎక్కువగా అవసరం లేనివారు మాత్రమే కాన్సన్‌ట్రేటర్లు ఉపయోగించాలి అని నిపుణులు చెబుతున్నారు.
  • ఆక్సిజన్ ఎక్కువగా అవసరం అయ్యేవారు వైద్యుల పర్యవేక్షణలో ఆసుపత్రిలో ఆక్సిజన్ పొందాల్సి ఉంటుంది.
  • వీటిని వాడుతున్న వారు ఎప్పటికప్పుడు ఆక్సీమీటర్ తో ఆక్సిజన్ లెవెల్స్ పరిశీలించుకోవాలి.
  • ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను ఫిలిప్స్, నిడెక్, ఆక్సిబ్లిస్, ఎయిర్‌సెప్, డెవిల్‌బిస్ వంటి కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిలో మీకు అనువైన దానిని ఎంచుకోవచ్చు.
  • అలాగే, ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఎంత స్వచ్చత తో ఆక్సిజన్ ను ఇవి అందిస్తాయి అనేది. 92 – 95 శాతం స్వచ్చత తో ఆక్సిజన్ అందించే పరికరాలనే కొనుగోలు చేసుకోవాలి.

Also Read: Google Maps: కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోన్న గూగుల్ మ్యాప్స్.. తక్కువ ఇంధనం ఖర్చయ్యే మార్గం

Covid 19 Vaccine: కరోనా నియంత్రణకు రెండు డోసుల వ్యాక్సిన్ సరిపోదా.. మూడో డోసు తీసుకోవల్సిందేనా..?