వన్‌ప్లస్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను 2023 ద్వితీయార్థంలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. 2023 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్లో వన్ ప్లస్ “From Fast & Smooth to Beyond” ప్యానెల్ డిస్కషన్‌ను నిర్వహించింది. ఇందులో వన్‌ప్లస్ ఈ విషయాన్ని తెలిపింది. వన్ ప్లస్ తన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను గతంలోనే టీజ్ చేసింది. శాంసంగ్, ఒప్పో, టెక్నో వంటి కంపెనీలు ఇప్పటికే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేశాయి. ఇప్పుడు వన్‌ప్లస్ కూడా ఈ విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ స్మార్ట్ ఫోన్ గురించిన మిగతా వివరాలు కంపెనీ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఒప్పో ఫైండ్ ఎన్ స్మార్ట్ ఫోన్‌నే వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్‌గా కంపెనీ లాంచ్ చేయనుందని గతంలో వార్తలు వచ్చాయి. వన్‌ప్లస్ వీ ఫ్లిప్, వన్‌ప్లస్ వీ ఫోల్డ్ పేర్లతో రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. వన్‌ప్లస్ ఇప్పటికే తన మొదటి ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను లాంచ్ చేసింది. ఈ ట్యాబ్ 144hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే 11 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది.
అయితే ఈ ప్యాడ్‌లో వెనుక వైపు ఒకే కెమెరాను అందించనున్నారు. అది సరిగ్గా మధ్యలో ఉంది. ఈ ప్యాడ్‌ను ఎక్కువ సేపు ఉపయోగించినా ప్రజలు దానిని పట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని, వారు ఇందులో సౌకర్యవంతంగా పని చేయగలుగుతారని కంపెనీ పేర్కొంది. వన్‌ప్లస్ ప్యాడ్ 9,510 mAh బ్యాటరీని కలిగి ఉంది. 67W సూపర్ వూక్ చార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. అంటే 60 నిమిషాల్లోనే ఒకటి నుంచి 90 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చన్న మాట.మీడియాటెక్ డైమెన్సిటీ 9000 SoC ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్‌లను OnePlus ప్యాడ్‌లో అందించారు. ఇందులో 144 Hz రిఫ్రెష్ రేట్, 7: 5 యాస్పెక్ట్ రేషియో, 2800 x 2000 పిక్సెల్ రిజల్యూషన్‌తో కూడిన 11.61-అంగుళాల స్క్రీన్ ఉంది. వన్‌ప్లస్ ప్యాడ్ ఫైల్ షేరింగ్, మల్టీ టాస్కింగ్ కోసం స్మార్ట్ సాఫ్ట్‌వేర్‌తో వస్తుంది. వన్‌ప్లస్ ప్యాడ్‌లోని ఆడియో సిస్టమ్ కోసం డాల్బీతో వన్‌ప్లస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
Our first foldable, coming later this year. #OnePlus pic.twitter.com/1Mk3VVrWxt
— OnePlus_USA (@OnePlus_USA) March 1, 2023
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..