Whatsapp: వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్.. ప్రైవసీకి మరింత పెద్ద పీట వేస్తూ..

|

Feb 13, 2024 | 2:33 PM

వాట్సాప్‌లో కొత్త ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో మీరు లాక్‌ స్క్రీన్‌ నుంచి నేరుగా స్పామ్‌ మెసేజ్‌లను బ్లాక్‌ చేసకోవచ్చు. మీకు వచ్చే స్పామ్‌ సందేశాలను నేరుగా బ్లాక్‌ చేసుకోవచ్చు. దీంతో యూజర్ల సమయం వృథా కాదు. స్మార్ట్ ఫోన్‌ స్క్రీన్ లాక్‌లో ఉన్న సమయంలోనే నేరుగా స్పామ్‌ మెసేజ్‌ను బ్లాక్‌ చేయవచ్చు. ఇందుకోసం...

Whatsapp: వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్.. ప్రైవసీకి మరింత పెద్ద పీట వేస్తూ..
Whatsapp
Follow us on

వాట్సాప్‌ యాప్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ యాప్‌ను ఉపయోగిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 2 బిలియన్ల మంది ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారంటేనే ఈ యాప్‌కు ఎంతటి ఆదరణ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఇదిలా ఉంటే యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వచ్చే వాట్సాప్‌ తాజాగా మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఇంతకీ వాట్సాప్‌ తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్లు ఏంటి.? వాటి ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వాట్సాప్‌లో కొత్త ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో మీరు లాక్‌ స్క్రీన్‌ నుంచి నేరుగా స్పామ్‌ మెసేజ్‌లను బ్లాక్‌ చేసకోవచ్చు. మీకు వచ్చే స్పామ్‌ సందేశాలను నేరుగా బ్లాక్‌ చేసుకోవచ్చు. దీంతో యూజర్ల సమయం వృథా కాదు. స్మార్ట్ ఫోన్‌ స్క్రీన్ లాక్‌లో ఉన్న సమయంలోనే నేరుగా స్పామ్‌ మెసేజ్‌ను బ్లాక్‌ చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సాప్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాల్సి పనిలేదు. అయితే వాట్సాప్‌లో ఇప్పటికే బ్లాక్ అండ్ రిపోర్ట్ ఆప్షన్ ఉంది ఈ కొత్త ఫీచర్‌తో ఉపయోగం ఏంటనేగా.

ఇప్పటివరకు వాట్సాప్ నోటిఫికేషన్లలో గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే స్పామ్ మెసేజ్‌లపై వార్నింగ్ మాత్రమే కనిపించేది. అయితే, ఈ కాంటాక్ట్‌లను బ్లాక్ చేయాలంటే తప్పనిసరిగా చాట్‌ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. కొన్నిసార్లు యూజర్లు తరచుగా స్పామ్ మెసేజ్‌లను అన్‌బ్లాక్ చేసి వదిలివేస్తారు. ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో మెసేజ్‌ ఓపెన్‌ చేయకుండానే బ్లాక్‌ చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌ను తీసుకురానున్నారు. క్రాస్ ప్లాట్‌ఫామ్‌ మెసేజింగ్‌కు సపోర్ట్‌ ఇచ్చే విధంగా కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో వాట్సాప్‌ నుంచి నేరుగా ఇతర మెసేజింగ్ యాప్స్‌కు మెసేజ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..