Whatsapp: ఇకపై సినిమాలు కూడా పంపుకోవచ్చు.. యూజర్ల కోసం వాట్సాప్‌ అదిరిపోయే ఆప్షన్‌..

|

Jun 04, 2022 | 12:41 PM

Whatsapp: వాట్సాప్‌ మెసేజింగ్ యాప్‌కు ఉన్న ఆదరణ ఎలాంటిదే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేటెస్ట్‌ ఫీచర్లతో యూజపర్లను ఆకట్టుకుంటోంది కాబట్టే ఈ యాప్‌కు ఇంతటి క్రేజ్‌ ఉందని చెప్పాలి. ముఖ్యంగా...

Whatsapp: ఇకపై సినిమాలు కూడా పంపుకోవచ్చు.. యూజర్ల కోసం వాట్సాప్‌ అదిరిపోయే ఆప్షన్‌..
Follow us on

Whatsapp: వాట్సాప్‌ మెసేజింగ్ యాప్‌కు ఉన్న ఆదరణ ఎలాంటిదే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేటెస్ట్‌ ఫీచర్లతో యూజపర్లను ఆకట్టుకుంటోంది కాబట్టే ఈ యాప్‌కు ఇంతటి క్రేజ్‌ ఉందని చెప్పాలి. ముఖ్యంగా మారుతోన్న అవసరాల దృష్ట్యా వాట్సాప్‌ కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఫీచర్‌తో యూజర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది వాట్సాప్‌. వాట్సాప్‌లో ప్రస్తుతం కేవలం 100 ఎంబీ సైజ్‌లో ఉన్న ఆడియో, వీడియో ఫైల్స్‌ను మాత్రమే షేర్‌ చేసుకునే అవకాశం ఉందనే విషయం తెలిసిందే. దీంతో ఇంతకంటే ఎక్కువ సైజ్‌ ఉన్న డేటాను షేర్‌ చేసుకోవాలంటే యూజర్లు ఇతర వెబ్‌సైట్స్‌ను ఉపయోగించుకోవాల్సిందే.

అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి వాట్సాప్‌ తాజాగా ఈ పరిమితిని 2జీబీకి పెంచేసింది. అంటే ఇకపై వాట్సాప్‌లో 2 జీబీ వరకు సైజ్‌ ఉన్న ఫైల్స్‌ను పంపుకోవచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వినియోగదారులకు ఈ ఆప్షన్‌ను తీసుకొచ్చారు. ఇప్పటికే కొందరికి అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌, త్వరలోనే అందరికీ అవకాశం కల్పించనున్నారు.

నిజానికి యూజర్ల నుంచి ఈ విషయమై గత కొన్నిరోజులుగా వాట్సాప్‌కు ప్రతిపాదనలు వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్‌లో వచ్చిన ఈ ఫీచర్‌తో ఇకపై యూజర్లు ఎంచక్కా సినిమాలు కూడా షేర్‌ చేసుకునే అవకాశం లభించనుందన్నమాట.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..