Nothing phone 2a: నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. భారతీయులకు మాత్రమే

|

Apr 29, 2024 | 2:46 PM

అయితే తాజాగా ఈ ఫోన్‌కు స్పెషల్‌ ఎడిషన్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్సెషల్‌ ఎడిషన్‌ ఫోన్‌ తాజాగా భారత మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ కేవలం భారతీయ వినియోగారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ చెబతోంది. మే 2వ తేదీ నుంచి ఈ ఫోన్‌ తొలి సేల్‌ ప్రారంభంకానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటలోకి రానుంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు...

Nothing phone 2a: నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. భారతీయులకు మాత్రమే
Nothing Phone 2a
Follow us on

లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ నథింగ్‌ ఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. ఈ సంస్థ నుంచి ఇప్పటి వరకు వచ్చిన రెండు ఫోన్‌లు భారీగా అమ్మకాలు జరుపుకున్నాయి. మిడ్ రేంజ్‌ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు, అదిరిపోయే లుక్స్‌తో తీసుకురావడంతో ఈ ఫోన్‌ సేల్స్‌ ఓ రేంజ్‌లో జరిగాయి. ఈ క్రమంలోనే నథింగ్ తన బ్రాండ్ నుంచి రెండో ఫోన్‌ నథింగ్ ఫోన్‌ 2ఏని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఈ ఫోన్‌కు స్పెషల్‌ ఎడిషన్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్సెషల్‌ ఎడిషన్‌ ఫోన్‌ తాజాగా భారత మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ కేవలం భారతీయ వినియోగారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ చెబతోంది. మే 2వ తేదీ నుంచి ఈ ఫోన్‌ తొలి సేల్‌ ప్రారంభంకానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటలోకి రానుంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 రీఫ్రెష్‌ రేటు, 1,300 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్‌ సొంతం. నథింగ్‌ ఫోన్‌ 2ఏలో మీడియా డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌ను అందించారు. ఇక ఈ ఫోన్‌ను 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్‌, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో తీసుకొచ్చారు. బ్యాటరీ విషయానికొస్తే 45 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

ఇక కనెక్టివిటీ పరంగా చూస్తే ఇందులో బ్లూటూత్‌ 5.3, వైఫై 6, ఎన్‌ఎఫ్‌సీ వంటి ఫీచర్లను అందించారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తోకూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 23,999కాగా 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 25,999, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 27,999గా నిర్ణయించారు. అయితే కొనగోలు సమయంలో పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..