
త్వరలోనే నథింగ్ ఫోన్ 4a ప్రో వస్తుందనే ప్రచారం బలంగా జరుగుతోంది. అయితే కంపెనీ మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ హ్యాండ్‌సెట్ ఇప్పుడు సర్టిఫికేషన్ డేటాబేస్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో త్వరలోనే మార్కెట్‌లో లాంచ్ అవుతుందనే అభిప్రాయం టెక్ నిపుణుల నుంచి వినిపిస్తోంది. తాజాగా సర్టిఫికేషన్ డేటాబేస్ లిస్ట్‌లో నథింగ్ ఫోన్ 4a ప్రో బ్యాటరీ సామర్థ్యం, వాటర్, డస్ట్ రెసిస్టెన్ష్ గురించి కూడా కొన్ని వివరాలు తెలుస్తున్నాయి. ఇది స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ చిప్‌సెట్, 12GB RAMతో వస్తుందని భావిస్తున్నారు. నథింగ్ ఫోన్ 4a ప్రో గత సంవత్సరం విజయవంతమైన నథింగ్ ఫోన్ 3a ప్రోకు అప్‌గ్రేడ్‌గా వస్తోంది.
ఇంకా విడుదల కాని నథింగ్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్, యూరోపియన్ ప్రొడక్ట్ రిజిస్ట్రీ ఫర్ ఎనర్జీ లేబులింగ్ (EPREL) వెబ్‌సైట్‌లో మోడల్ నంబర్ A069Pతో లిస్ట్ అయింది. ఈ మోడల్ నంబర్ నథింగ్ ఫోన్ 4a ప్రో అని టెక్ నిపుణులు భావిస్తున్నారు. 50W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,080mAh బ్యాటరీ దీనికి ఉందని లిస్టింగ్ చూపిస్తుంది. నథింగ్ ఫోన్ 4a ప్రో బ్యాటరీ దాని ప్రారంభ సామర్థ్యంలో 80 శాతానికి చేరుకునే ముందు 1,400 ఛార్జింగ్ సైకిల్స్‌ను తట్టుకోగలదని లిస్టింగ్ చూపిస్తుంది. IP65 రేటెడ్ బిల్డ్‌ను కూడా సూచిస్తుంది. ఇది A నుండి E స్కేల్‌లో మరమ్మతు చేయగలగడంలో C రేటింగ్‌ను చూపుతుంది.
నథింగ్ ఫోన్ 4a ప్రో 12GB RAM, 256GB స్టోరేజ్ మోడల్ ధర 540 డాలర్లు (మన కరెన్సీలో దాదాపు రూ.49,000) ఉంటుందని అంచనా. ఇది నలుపు, నీలం, గులాబీ, తెలుపు రంగుల ఎంపికలలో ప్రామాణిక ఫోన్ 4aతో పాటు అధికారికంగా అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. ఫోన్ 4a ప్రో ఫోన్ 3a ప్రో కంటే అప్‌గ్రేడ్‌లతో వచ్చే అవకాశం ఉంది. ఫోన్ 3a ప్రో గత ఏడాది మార్చిలో ఇండియాలో 8GB+128GB ఆప్షన్ ధర రూ.27,999కి ప్రారంభించబడింది. దీనికి 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 SoC ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ Samsung 1/1.56-అంగుళాల ప్రైమరీ రియర్ సెన్సార్, 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ షూటర్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి