Nothing Phone 2: ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వచ్చేందుకు నథింగ్ ఫోన్ 2 సిద్ధంగా ఉంది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న నథింగ్ ఫోన్ 1 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ ఏడాది జూలైలో లాంచ్ అవనుంది. ఈ ఇదిలా ఉండగా.. నథింగ్ ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్ తయారీ భారత్‌లోనే ప్రారంభం కానుందని నథింగ్ కంపెనీ క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ ఫోన్ ధరకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేనప్పటికీ దీనిలో ఉండనున్న ఫీచర్లు అయ్యాయి. ఇంకా రీసైకిల్ చేసిన మెటీరియల్స్, ప్లాస్టిక్ రహిత ప్యాకేజింగ్‌తో సహా నథింగ్ ఫోన్ 2 రానుండడం ఈ ఫోన్‌లోని విశిష్టత.
Nothing Phone 2 ఫీచర్ల గురించి చెప్పుకోవాలంటే.. నథింగ్ ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 1 కన్నా కొంచెంద పెద్దదిగా 6.7-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుందని అంచనా. అలాగే 4,700mAh బ్యాటరీ, Qualcomm ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ Snapdragon 8+ Gen 1 SoC ద్వారా నథింగ్ ఫోన్ 2 రానుంది. గతంలో వచ్చిన నథింగ్ ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్‌లోని Snapdragon 778G+ కన్నా ఇది శక్తివంతమైనది. 12GB RAM వేరియంట్‌తో రాబోతున్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13తో రన్ అవుతుంది. అలాగే ఈ ఫోన్ భారత్‌లో లాంచ్ కాకముందే BIS సర్టిఫికేషన్‌ను కూడా పొందినట్లుగా ప్రకటించుకుంది. ఈ ఫోన్‌కి 3 ఏళ్ల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను కంపెనీ ఇవ్వనుంది.
??Phone (2) is the first time we’ve achieved a lower carbon footprint on a second-generation product. A significant step towards a more sustainable smartphone industry. Let’s explore its milestones.
A thread ⬇️ pic.twitter.com/1zYdmU3yqL
— Nothing (@nothing) May 31, 2023
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి