Nokia C 32: నోకియా నుంచి రానున్న సరికొత్త సీ32 స్మార్ట్‌ఫోన్.. ధర తెలిస్తే కొనకుండా ఉండలేరు

|

May 22, 2023 | 4:05 AM

సాంకేతిక రంగంలో రోజురోజుకు కొత్త మార్పులు పుట్టుకొస్తున్న వేళ నోకియా సంస్థ దేశీయ మార్కెట్లో సీ32 మొబైల్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైపోయింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెలలోనే అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉంటుందని సమాచారం.

Nokia C 32: నోకియా నుంచి రానున్న సరికొత్త సీ32 స్మార్ట్‌ఫోన్.. ధర తెలిస్తే కొనకుండా ఉండలేరు
Nokia C 32
Follow us on

సాంకేతిక రంగంలో రోజురోజుకు కొత్త మార్పులు పుట్టుకొస్తున్న వేళ నోకియా సంస్థ దేశీయ మార్కెట్లో సీ32 మొబైల్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైపోయింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెలలోనే అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉంటుందని సమాచారం. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్న ఈ మొబైల్ భారతీయ మార్కెట్లో అడుగుపెట్టనుంది. అయితే దీని ధర రూ. 9,999 నుంచి మొదలవుతుందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ బీచ్ పింక్, చార్కోల్, అటమ్ గ్రీన్ కలర్‌లలో అందుబాటులో ఉంది. అయితే ఇలాంటి కలర్ ఆప్షన్స్ మన దేశంలో కూడా లభించనున్నాయి.

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఈ కొత్త నోకియా సీ32 మొబైల్ 6.5 ఇంచెస్ హెచ్‍డీ రెజల్యూషన్ ఐపిఎస్ LCD డిస్‍ప్లే కలిగి, గ్లాస్ బ్యాక్ అండ్ మెటాలిక్ ఫినిష్ పొందుతుంది. అలాగే ఇందులో యునిఎస్‍ఓసీ ఎస్‍సీ9863ఏ ప్రాసెసర్ ఉంటుంది. వర్చువల్‍గా ర్యామ్‌ను 3జీబీ వరకు అదనంగా పెంచుకోవచ్చు. దీనికి మైక్రోఎస్‍డీ కార్డు స్లాట్ కూడా ఉంటుంది.ఇక కెమెరా ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇందులో రెండు రియర్ కెమెరాలు (50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా & 2 మెగాపిక్సెల్ కెమరా), ఒక 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ మొబైల్ 10 వాట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. పవర్ బటన్‍కే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ ఉంటుంది. మొత్తం మీద తక్కవ ధరలోనే ప్రస్తుత కాలంలో ఉపయోగించేందుకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..