Google pixel update: గూగుల్ ఫిక్సెల్ ఫోన్లకు నయా అప్‌డేట్.. ఇకపై అండర్ వాటర్ అందాలు కూడా మీ ఫోన్‌లో భద్రం
శరవేగంగా విస్తరిస్తున్న స్మార్ట్ ఫోన్ల మార్కెట్ లో తమ స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ప్రముఖ కంపెనీలు అనే ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. దానిలో భాగంగా బెస్ట్ ఫీచర్లతో ఫోన్లను విడుదల చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. కస్టమర్ల అవసరాలను అనుగుణంగా అనేక మార్పులు, అప్ డేట్లు కూడా చేస్తున్నాయి. దీనిలో భాగంగా గూగూల్ కంపెనీ తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లకు ఆటోమేటిక్ అండర్ వాటర్ ఫొటోగ్రఫీ మోడ్ ను తీసుకువచ్చింది. 2024 అక్టోబర్ ఫీచర్ డ్రాప్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా భూమిపై నిలబడి ఫొటోలు, వీడియోలు తీసుకుంటాం. వివిధ రకాల సీనరీలను ఫొటోలలో బంధిస్తాం. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పుట్టిన రోజు వేడుకలు, ఆత్మీయ సమావేశాలు, మిత్రులతో కలిసినప్పుడు. ఇలా ప్రతి సమయంలోనూ ఫొటోలు తీసుకుంటూ ఉంటాం. అయితే నీటి లోపల ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు వీలుగా గూగుల్ కొత్త అప్ డేట్ తీసుకువచ్చింది. పిక్సల్ 9 సిరీస్ ఫోన్ల కెమెరా సామర్థ్య, ఇతర సెట్టింగ్ లకు అండర్ వాటర్ ఫొటోగ్రఫీ మోడ్ ను తీసుకురానుంది. పిక్సెల్ 9.6 అనే అప్ డేట్ ద్వారా వినియోగదారులు నీటి అడుగున ఫొటోలు, వీడియోలను తీసుకునే అవకాశం ఉంది. గూగుల్ పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ ఎల్ పరికరాలకు మాత్రమే కొత్త అప్ డేట్ అందుబాటులో ఉంటుంది.
కొత్త ఫీచర్ ను వినియోగించుకునే వారు ముందుగా కెమెరా సెట్టింగ్ లను అప్ డేట్ చేయాలి. లేటెస్ట్ వెర్షన్ కు నావిగేట్ చేయాలి. అండర్ వాటర్ ఫొటోగ్రఫీ మోడ్ ను టోగుల్ చేసుకోవాలి. దీని వల్ల నీటి అడుగున ఫొటోలు తీసేటప్పడు రంగులు స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే సరైన, సక్రమమైన ఫొటోలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఫొటోలు బాగా రావాలంటే వాటర్ ప్రూఫ్ కేసును ఉపయోగించాలి. మోడ్ అంతా సక్రమంగా ఉన్నప్పుడు కెమెరా వ్యూప్లైండర్ లో అండర్ వాటర్ ఫొటోగ్రఫీ, వీడియో ఆన్ అని ఇంటికేషన్ కనిపిస్తుంది. కెమెరా నాణ్యతతో పాటు మిగిలిన విషయాలలో పిక్సెల్ ఫోన్లు ప్రత్యేకంగా ఉంటాయి. ఏ సమయంలోనైనా వీటితో చక్కని ఫొటోలు తీసుకునే అవకాశం ఉంటుంది.
వాటర్ ప్రూప్ కేసుతో అండర్ వాటర్ మోడ్ తో నీటి అడుగున ఫొటోలు తీసుకునే వీలు కల్పించేందుకు గూగుల్ చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగానే పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ ఎల్ ఫోన్లకు అండర్ వాటర్ ఫొటోగ్రఫీ మోడ్ ను తీసుకువస్తోంది. పిక్సెల్ సిరీస్ ఫోన్లకు అప్ డేట్ చేస్తున్న అండర్ వాటర్ ఫొటోగ్రఫీ మోడ్ తో వినియోగదారులకు మంచి అనుభవం కలుగుతుంది. మీరు అటాచ్ చేసిన ఏదైనా వాటర్ ప్రూఫ్ కేస్ తో పనిచేస్తుంది. ఫోన్ ను నీటి లోపలకు తీసుకువెళుతున్నట్టు గుర్తించిన తర్వాత పిక్సెల్ కెమెరా యాప్ నిర్థిష్ఠ పరిమితులను సర్దుబాటు చేస్తుంది. ఏదిఏమైనా అండర్ వాటర్ మోడ్ ను ఉపయోగించుకోవడానికి వాటర్ ప్రూఫ్ కేస్ చాలా అవసరం.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి