Smartphone Tips: అయ్యో.. మీ ఫోన్‌ నీటిలో పడిపోయిందా? మరి ఎలా? నో టెన్షన్‌.. ఇలా చేయండి!

చాలా మంది స్మార్ట్‌ఫోన్లు నీటిలో పడిపోతుంటాయి. లేదా వర్షంలో తడుస్తుంటాయి. అలాంటి సమయంలో ఫోన్‌ పాడైపోవడం ఖాయం. చాలా మంది ఫోన్‌ నీటిలో పడగానే వేడి ప్రదేశంలో పెట్టడం, డ్రై చేయడం.. ఎండకు ఆరబెట్టడం ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలా చేయడం తప్పని టెక్‌ నిపుణులు చెబుతున్నారు..

Smartphone Tips: అయ్యో.. మీ ఫోన్‌ నీటిలో పడిపోయిందా? మరి ఎలా? నో టెన్షన్‌.. ఇలా చేయండి!
Smartphone Tips
Follow us
Subhash Goud

|

Updated on: Oct 24, 2024 | 11:00 AM

మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, కొన్ని సమయాల్లో ఫోన్‌ నీటిలతో పడుతుంటుంది. అలాగే వర్షంలో కూడా తడుస్తుంటుంది. సెల్ ఫోన్ వర్షంలో లేదా నీటిలో తడిస్తే వెంటనే ఏం చేయాలి? వర్షంలో తడిసిన తర్వాత కూడా మన ఫోన్‌ని భద్రంగా ఉంచుకోవడం ఎలా..? వీటి గురించి తెలుసుకుందాం.

కొన్నిసార్లు మొబైల్‌ వర్షం వల్ల తడిసిపోతుంది లేదా నీటిలో పడిపోతుంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లు వాటర్‌ప్రూఫ్‌గా మారాయి. ఫోన్‌లోకి వాటర్‌ పోయాయంటే అంతే సంగతి. వెంటనే రిపేర్‌ సెంటర్‌కు తీసుకెళ్లాల్సిందే. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. కొన్ని సమయాల్లో ఫోన్‌ నీటిలో పడిపోవడం, వర్షంలో తడవడం వంటి అనుభవం ప్రతి ఒక్కరికి ఎదురై ఉంటుంది.

చాలా మంది ఫోన్‌ను ఎండలో ఆరబెట్టి, ఛార్జింగ్ పెట్టడం లేదా స్టవ్ దగ్గర పెట్టి ఫోన్‌ను వేడి చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అలా చేయడం వల్ల ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్, మైక్‌లో దుమ్ము ప్రవేశించి దెబ్బతినవచ్చు. ఇలాంటివి అస్సలు చేయకండి. వేడి ప్రదేశంలో ఉంచడం వల్ల నీరు ఆవిరైపోతుంది. అయినప్పటికీ మదర్‌బోర్డు, ఇతర పార్ట్స్‌లోకి నీరు చేరి మరింత డ్యామెజ్‌ అవుతుంది. తడిసిన ఫోన్‌ నీరు ఆవిరి అయ్యేందుకు వేడి ప్రదేశంలో ఉంచడం వల్ల స్క్రీన్ టచ్, స్పీకర్ బ్యాటరీ మొదలైనవి దెబ్బతింటాయి.

ఇవి కూడా చదవండి

నీటిలో పడిన తర్వాత బ్యాటరీ స్విచ్ ఆఫ్ అవుతుంది. దీని తర్వాత ఆ ఫోన్‌ను రిపేర్ చేయడానికి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్ నీటిలో పడినా.. తడిసినా వెంటనే స్విచ్ ఆఫ్ చేయండి. ఎక్కువ నీరు ఉంటే ఆటోమేటిక్‌గా ఆఫ్‌ అవుతుంది. మొబైల్‌లో నీరు వెళ్లితే గూగుల్‌కి వెళ్లి, FIX MY SPEAKER పేజీని ఓపెన్‌ చేసి అక్కడ కనిపించే సింబల్‌పై క్లిక్‌ చేయడం ద్వారా మీకు సౌండ్‌ అవస్తుంది. అది ఫోన్‌ను వైబ్రేట్ చేసి నీటిని బయటకు పంపుతుంది.

స్మార్ట్‌ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత బ్యాక్‌ కవర్‌ కేసు, కవర్లు, సిమ్ కార్డ్, మెమరీ కార్డ్ ఏదైనా ఉంటే వాటిని తీసివేయడం. ఈరోజు కొన్ని ఫోన్‌లలో తొలగించగల బ్యాటరీలు లేవు. ఒకవేళ మీ ఫోన్‌లో ఉంటే, వెంటనే బ్యాటరీ తీసివేయండి. ఇలా చేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్‌ని తీసుకుని బ్యాటరీ కంపార్ట్‌మెంట్, స్క్రీన్, కనెక్టివిటీ పోర్ట్‌లు మొదలైన వాటితో సహా తేమ, నీరు ఉన్న చోట తుడిచివేయండి.

ఫోన్‌ నీటిలో పడితే బియ్యంలో పెట్టడం వల్ల తేమ ఆవిరైపోతుంది. సాధారణంగా ఉపయోగించే సాంకేతికత ఇది. ఎందుకంటే బియ్యానికి నీటి తేమను గ్రహించే గుణం ఉంటుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. బియ్యం బ్యాగులో ఉంచడం వల్ల మీ ఫోన్ వేగంగా డ్రై అవుతుంది.

ఫోన్‌లో తడి ఆరిపోవడానికికనీసం ఒక రోజు పడుతుంది. ఆపై దాన్ని ఆన్ చేయడానికి ప్రయత్నించండి. నష్టం తక్కువగా ఉంటే, ఫోన్‌ మళ్లీ పని చేస్తుంది. అయినప్పటికీ పని చేయకపోతే సర్వీస్‌ సెంటర్‌ తీసుకెళ్లడం ఉత్తమం. మీ ఫోన్ అలా పని చేయకపోతే, వెంటనే సమీపంలోని సెల్ ఫోన్ సర్వీస్ షాప్‌కు వెళ్లండి. అక్కడ మీ ఫోన్ పూర్తిగా విడదీసి నీరు లేకుండా శుభ్రం చేస్తారు. ఇది మీ మొబైల్ ఫోన్‌కు ఎలాంటి నష్టం జరగకుండా చేస్తుంది. వాటర్ రెసిస్టెన్స్ బ్యాక్ కవర్లను కొనుగోలు చేసి వాటిని మీ మొబైల్ ఫోన్‌లో పెట్టుకోవడం మంచిది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి