BSNL: టెలికాం ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌.. భారీ మార్పులు!

BSNL: ప్రస్తుతం బీఎస్‌ఎస్ఎల్‌ దూసుకుపోతోంది. ప్రైవేట్‌ టెలికాం కంపెనీలైన జియో,ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాలకు స్వస్తి చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవల టారీఫ్‌ ధరలు పెంచడంతో లక్షలాది మంది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మళ్లుతున్నారు..

BSNL: టెలికాం ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌.. భారీ మార్పులు!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 24, 2024 | 4:16 PM

జూలై నెలలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ టారిఫ్‌లను పెంచాయి. అప్పటి నుండి దేశ ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL మళ్లీ పుంజుకుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లలో నిరంతర పెరుగుదల ఉంది. ఇప్పుడు సరికొత్త మార్పులు చేయబోతోంది ప్రభుత్వం. రానున్న నెలల్లో టారిఫ్‌లను పెంచబోమని బీఎస్‌ఎన్‌ఎల్‌ స్పష్టం చేసింది. మరోవైపు, బీఎస్‌ఎన్‌ఎల్‌ వచ్చే ఏడాదిలో 5G టెక్నాలజీ రానుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ మార్పు టెలికాం పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కష్టాల్లో పడనున్నాయి. మార్పు గురించి టెలికాం మంత్రి ఏం చెప్పారో చూద్దాం.

పెరుగుతున్న కస్టమర్లు:

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL గత రెండేళ్లలో లాభాలను నమోదు చేసిన తర్వాత మార్పుల తీసుకువస్తోందని కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. గత త్రైమాసికంలో కంపెనీ ప్రతి నెలా కస్టమర్లను చేర్చుకుంది. అలాగే దాని కస్టమర్ల సంఖ్య 50-60 లక్షలు పెరిగింది. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, మారుమూల గ్రామాల్లో బిఎస్‌ఎన్‌ఎల్ టెలిఫోన్ సేవలను అందిస్తోందని, నెట్‌వర్క్‌ను అధునాతనంగా మార్చడం ద్వారా దాని సేవను మెరుగుపరుస్తోందని అన్నారు.

ఇది కూడా చదవండి: BSNL New Logo: బీఎస్‌ఎన్‌ఎల్‌ లోగో మారింది.. యూజర్ల కోసం సరికొత్త నిర్ణయాలు!

యూజర్ల కోసం నేషనల్‌ వైఫై రోమింగ్‌ సర్వీలను ప్రారంభించింది. ఎనీ టైమ్ సిమ్ (ATS) కియోస్క్‌లతో కొత్త BSNL SIM కార్డ్‌లను కొనుగోలు చేయడం కూడా సులభతరం చేస్తోంది. యూజర్లు అదనపు ఛార్జీలు లేకుండా బీఎస్‌ఎన్‌ఎల్‌ హాట్‌స్పాట్స్‌లలో హైస్పీడ్‌ సేవలను పొందేందుకు అవకాశం కల్పించింది. మైనింగ్‌ కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్పెషల్‌ ప్రైవేట్‌ 5జీ నెట్‌వర్క్‌ను అందించేందుకు సీ-డీఏసీతో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌ లోగోలో కూడా మార్పులు చేసింది. లోగోను సరికొత్తగా రంగుల్లో సృష్టిచింది. 4జీ,5జీ నెట్‌వర్క్‌కు త్వరగా తీసుకువచ్చేందుకు పనులు వేగవంతం చేస్తోంది. 4జీ నెట్‌వర్క్‌ ఈ ఏడాది చివరి వరకు పూర్తి స్థాయిలో తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, 5జీ వచ్చే ఏడాది మార్చి వరకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది.

ఇది కూడా చదవండి: Smartphone Tips: అయ్యో.. మీ ఫోన్‌ నీటిలో పడిపోయిందా? మరి ఎలా? నో టెన్షన్‌.. ఇలా చేయండి!

89 వేల కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ:

గత ఏడాది జూన్‌లో నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్‌ఎల్‌ 4G, 5G నెట్‌వర్క్‌ను తీసుకువచ్చేందుకు రూ.89,047 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ గత 12 సంవత్సరాలుగా నష్టాలను చవిచూస్తోంది. ఆర్థిక స్థితి పరంగా చూస్తే బీఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాల్లో ఉన్న మాట వాస్తవమేనన్నారు. కానీ గత రెండేళ్లలో పన్నుకు ముందు ఆదాయాలు (EBITDA- Earnings before interest, taxes, deprecia) సానుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు.

అంటే EBITDA పరంగా మనకు నష్టం లేదు. కంపెనీ ఎప్పుడు లాభదాయకంగా మారుతుందో మంత్రి చెప్పలేదు. నేటికీ టెలికాం సేవల పరంగా మన దేశంలోని చిట్టచివరి గ్రామాలకు సేవలందిస్తున్నది బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రమేనని అన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కి చాలా పేరు ఉందని నేను నమ్ముతున్నాను.. దానికి ఊపందుకోవాల్సిన అవసరం ఉందని సింధియా చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి