
ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం గణనీయంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ ఫోన్స్‌ను లాంచ్ చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువ. కాబట్టి మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఇండియాలో స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసి మార్కెట్‌ను కైవసం చేసుకోవాలని అన్ని కంపెనీలు అనుకుంటున్నాియ. ఈ నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన పోకో సీ 61 పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లో లాంచ్ చేస్తుంది. మార్చి 26న పోకో సీ 61 భారతదేశంలో ప్రారంభిస్తామని కంపెనీ తన అధికారిక సోషల్ మీడియా ఛానెల్ ద్వారా ధ్రువీకరించింది. దేశంలోని ఎంఐ ఉప-బ్రాండ్ అయిన పోకో సీ 61 ఫోన్2ను కొత్త హ్యాండ్‌సెట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పోకో సీ 61 ధరతో పాటు ఫీచర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.
పోకో సీ 61 అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో పాటు అతి పెద్ద బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ 6 జీబీ ఆన్‌బోర్డ్ ర్యామ్‌తో వస్తుంది. అలాగే మీడియా టెక్ హీలియో జీ 36 ప్రాసెసర్ ద్వారా పని చేసే ఈ ఫోన్ మార్చి 26 మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా లాంచ్ చేస్తారు. కంపెనీ రిలీజ్ చేసిన టీజర్ ప్రకారం, ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఫోన్ డిజైన్, కొన్ని స్పెసిఫికేషన్‌లను టీజ్ చేస్తూ ప్రత్యేకమైన మైక్రోసెట్‌ను రూపొందించింది. ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ప్రకారం పోకో సీ 61లో 90 హెచ్‌జెడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే. 6 జీబీ ర్యామ్‌తో పాటు మెరుగైన మల్టీ టాస్కింగ్ కోసం వినియోగదారులు అదనంగా 6 జీబీ వర్చువల్ ర్యామ్‌ను పొందవచ్చు. అలాగే ఈ ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.
ముఖ్యంగా పోకో సీ 61 రెడ్ మీ ఏ3కు సంబంధించిన రీబ్రాండెడ్ వెర్షన్‌గా వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పోకో సీ 61 4 జీబీ + 64 జీబీ, 6 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. అలాగే ఈ ఫోన్ దర రూ. 7,499 నుంచి రూ. 8,499 వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. పోకో సీ 61 6.71 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ స్క్రీన్‌తో 500 నిట్స్ గరిష్ట ప్రకాశంతో వస్తుంది. అలాగే గొరిల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఆప్టిక్స్ కోసం పోకో సీ 61 8 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్, 0.08 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌లతో వస్తంది. అలాగే ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. పోకో సీ 61 10 వాట్స్ వైర్డు ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..