
టెలికం మోసాలను అరికట్టడానికి, వినియోగదారులను రక్షించడానికి టెలికమ్యూనికేషన్ల విభాగం (డీఓటీ) కొత్త సిమ్ కార్డులను కొనుగోలు చేయడానికి ఇటీవల కఠినమైన నియమాలను ప్రవేశపెట్టింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం కొత్త సిమ్ జారీ చేయడానికి ఆధార్ కార్డు ఇప్పుడు తప్పనిసరి చేశారు. వినియోగదారులు ప్రస్తుతం తమ ఆధార్‌తో ఎన్ని మొబైల్ నంబర్‌లు లింక్ చేసి ఉన్నాయో? కూడా తనిఖీ చేసుకునే అవకాశం కల్పించారు. ఇటీవల పెరుగుతున్న మోసాలతో పాటు నకిలీ కాల్స్ కేసులను పరిష్కరించడానికి డీఓటీ సిమ్ జారీ ప్రక్రియను కఠినతరం చేయడమే కాకుండా నకిలీ నంబర్లను నిష్క్రియం చేయడానికి ప్రత్యేక చర్యలను తీసుకుంది.
మీ ఆధార్‌ని ఉపయోగించి ఎవరైనా మోసపూరితంగా సిమ్ కార్డు పొందితే అది చాలా ప్రమాదకరం. అలాంటి దుర్వినియోగం మీ గోప్యతను దెబ్బతీస్తుంది. అలాగే మిమ్మల్ని చట్టపరమైన ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది. మీ ఆధార్‌తో లింక్ చేసిన నంబర్‌ని ఉపయోగించి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరిగితే మీరు జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. అందువల్ల, మీ పేరు మీద ఎన్ని సిమ్‌లు ఉన్నాయో? తనిఖీ చేయడం చాలా ఉత్తమం. అలాగే మీకు ఏవైనా అనధికార నంబర్‌లు కనిపిస్తే చర్య తీసుకోవడం చాలా అవసరం.
సైబర్ మోసాలు పెరుగుతున్నందున మీ ఆధార్ వాడకాన్ని పర్యవేక్షించడం చాలా ముఖ్యం. చాలా మంది తెలియకుండానే వారి ఆధార్ వివరాలను పంచుకుంటారు. వీటిని దుర్వినియోగం చేయవచ్చు. మీ ఆధార్‌తో లింక్ చేసిన సిమ్‌లను తనిఖీ చేయడం వల్ల గుర్తింపు దొంగతనాన్ని నివారించవచ్చు. అలాగే చట్టపరమైన సమస్యల నుండి మిమ్మల్ని రక్షించవచ్చు. సంచార్ సాథీ పోర్టల్‌ని ఉపయోగించడం ద్వారా మీరు మీ గుర్తింపును కాపాడుకోవచ్చు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..