దేశీయ టెలికాం దిగ్గజాలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే 5జీ సేవల ద్వారా రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ సంస్థలు ముందుజలో ఉండగా.. వీటి తర్వాత వోడాఫోన్ ఐడియా ఉంది. ఇది కూడా తన పరిధిని పెంచుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇప్పటికే ఉన్న రూ.129, రూ. 298 ప్లాన్ల స్థానంలో రూ. 368, రూ. 369 లతో కొత్త ప్రయోజనాలను తీసుకొచ్చింది. వీటిల్డో రోజువారీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు పలు ఓటీటీ ప్లాట్ ఫారమ్ లకు సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తోంది. రూ.368, రూ.369 ప్లాన్స్ మధ్య పెద్దగా తేడా ఏమీ లేదు. అయితే, రూ.368 ప్లాన్ సన్ నెక్ట్స్ యాప్ కి యాక్సెస్ కలిగి ఉంటే, రూ.369 ప్లాన్ ద్వారా సోనిలివ్ యాప్ కి సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ ప్లాన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
వొడాఫోన్ ఐడియా లాంచ్ చేసిన రూ. 368 ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి.. రూ.368 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్ కి ప్రతిరోజూ 2జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. అంటే యూజర్ కి మొత్తం 60జీబీ డేటా లభిస్తుంది. అంతేకాదు, యూజర్ కి ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. ఇంకా ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు కూడా లభిస్తాయి. ఈ కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ కాకుండా కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా ప్లాన్ ద్వారా లభిస్తాయి. అవేంటంటే, యూజర్ కి సన్ నెక్ట్స్ యాప్ కి యాక్సెస్ లభిస్తుంది. ఇది 30 రోజుల పాటు వర్తిస్తుంది. వీకెండ్ రోలోవర్ ఫెసిలిటీ, వీఐ మూవీస్ సబ్‌స్క్రిప్షన్, ప్రతినెల 2జిబి డేటా బ్యాకప్ లభిస్తాయి. అయితే ఈ బెనిఫిట్స్ పొందేందుకు వీఐ యాప్ యూజర్లు 121249 కి డయల్ చేయాల్సి ఉంటుంది.
వొడాఫోన్ ఐడియా రూ.369 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు ఇలా ఉన్నాయి. రూ.369 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్ కి ప్రతిరోజూ 2జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. అంటే కస్టమర్ కి మొత్తం 60జీబీ డేటా లభిస్తుంది. ఇంకా అపరిమిత కాలింగ్ సౌకర్యం యూజర్ కి లభిస్తుంది. ఇంకా ప్రతిరోజూ యూజర్ కి 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. అదనపు ప్రయోజనాల విషాయానికి వస్తే యూజర్ కి బింజ్ ఆల్ నైట్, వీకెండ్ డేటా రోలోవర్, సోనిలివ్ యాప్ యాక్సెస్, వీఐ మూవీస్, టీవీ యాప్స్, ప్రతినెల 2జీబీ వరకు డేటా బ్యాకప్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అయితే ఈ అదనపు ప్రయోజనాలు పొందేందుకు యూజర్ 121249 కి డయల్ చేయాల్సి ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..