VI Plan: వొడాఫోన్‌ ఐడియా నుంచి నయా పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌.. రూ.701తో బోలెడన్ని ప్రయోజనాలు

అన్ని కంపెనీలు పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులను ఆకట్టుకునేందుకు వివిధ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ అయిన వొడాఫోన్‌ ఐడియా పోస్ట్‌పెయిడ్‌ యూజర్లను ఆకట్టుకునేందుకు వివిధ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ ప్లాన్స్‌ ఎక్కువగా రూ.701 ప్లాన్‌ ఆదరణ పొందింది. కాబట్టి రూ.701 ప్లాన్స్‌ వీఐ ఏయే బెనిఫిట్స్‌ అందిస్తుందో? ఓసారి తెలుసుకుందాం.

VI Plan: వొడాఫోన్‌ ఐడియా నుంచి నయా పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌.. రూ.701తో బోలెడన్ని ప్రయోజనాలు
Mobile

Updated on: Sep 15, 2023 | 4:00 PM

భారతదేశంలో టెలికాం రంగంలో జియో రాకతో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. తక్కువ ధరకే డేటా వినియోగదారులకు అందడంలో జియో కీలకపాత్ర పోషించింది. జియో దెబ్బకు అన్ని కంపెనీలు డేటా చార్జీలను తగ్గించాల్సి వచ్చింది. అలాగే ఏ నెట్‌వర్క్‌కు అయినా అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ కాన్సెప్ట్‌ కూడా జియోనే అందుబాటులో తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో గతంలో అంతరాయం లేని సేవల కోసం చాలా మంది వినియోగదారులు పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్స్‌ను వాడేవారు. ప్రీపెయిడ్‌లోనే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ ఆఫర్స్‌ రావడంతో క్రమేపి పోస్ట్‌పెయిడ్స్‌కు ఆదరణ తగ్గింది. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులను ఆకట్టుకునేందుకు వివిధ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ అయిన వొడాఫోన్‌ ఐడియా పోస్ట్‌పెయిడ్‌ యూజర్లను ఆకట్టుకునేందుకు వివిధ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ ప్లాన్స్‌ ఎక్కువగా రూ.701 ప్లాన్‌ ఆదరణ పొందింది. కాబట్టి రూ.701 ప్లాన్స్‌ వీఐ ఏయే బెనిఫిట్స్‌ అందిస్తుందో? ఓసారి తెలుసుకుందాం.

వొడాఫోన్‌ ఐడియా రూ. 701 ప్లాన్ వినియోగదారులకు ఒక ప్రత్యేకమైన ఆఫర్‌గా నిలుస్తుంది. ఈ ప్లాన్‌ అపరిమిత డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. ఒక వినియోగదారు ఒక బిల్లింగ్ వ్యవధిలో ఎంత డేటా వినియోగించవచ్చనే దానిపై పరిమితులు లేవు. ఇది ఖరీదైన ప్లాన్ అయినప్పటికీ చాలా మంది వినియోగదారులు ఆన్‌లైన్‌లో చేసే దాదాపు ప్రతిదానికీ మొబైల్ డేటాపై ఎక్కువగా ఆధారపడే వారు ఈ ప్లాన్‌ వాడుకోవచ్చు. అలాగే వారి మొబైల్ హాట్‌స్పాట్‌తో ఎక్కువ పరికరాలను కనెక్ట్‌ చేసుకోవచ్చు. 

వివిధ యాప్స్‌ సబ్‌స్క్రిప్షన్లు

వీఐ రూ.701 ప్లాన్‌తో వినియోగదారులు నిజంగా అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు నెలకు 3000 ఎస్‌ఎంఎస్‌లను పంపే వీలు ఉంటుంది. అలాగే అపరిమిత మ్యూజిక్ డౌన్‌లోడ్‌లతో 6 నెలల పాటు హంగామా మ్యూజిక్, వీఐ మూవీస్‌ & టీవీ, వీఐ గేమ్స్‌, ఆరు నెలల పాటు అమెజాన్‌ ప్రైమ్‌, ఓ ఏడాది డిస్నీ + హాట్‌ స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌, సోనీ ఎల్‌ఐవీ ప్రీమియం, సన్‌ ఎన్‌ఎక్స్‌టీ సబ్‌స్క్రిప్షన్ల వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఈజీ డినర్‌ ప్రైమ్‌కు కూడా త్రైమాసిక సభ్యత్వాన్ని పొందవచ్చు. అలాగే ఈజ్‌మైట్రిప్‌ ద్వారా రిటర్న్ ఫ్లైట్‌ బుక్‌ చేసుకోవడానికి రూ.750 తగ్గింపు లభిస్తుంది. ముఖ్యంగా ఒక సంవత్సరం నార్టన్‌ 360 మొబైల్ సెక్యూరిటీ కవర్ లభిస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..