భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత ల్యాప్‌టాప్‌ల వినియోగం పెరిగింది. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగాక ల్యాప్‌టాప్ వాడే వారి సంఖ్య పెరిగింది. కేవలం ఆఫీస్ అవసరాలకే కాకుండా ఆన్‌లైన్ క్లాసులకు ఉపయోగపడడంతో విద్యార్థులు కూడా ఎక్కువగా ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేస్తున్నారు. అయితే అనూహ్యంగా పెరిగిన డిమాండ్ నేపథ్యంలో అన్ని కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునే విధంగా సరికొత్త ల్యాప్‌టాప్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా మొబైల్ తయారీ సంస్థలు కూడా ల్యాప్‌టాప్‌లు రిలీజ్ చేస్తున్నాయంటే వాటి డిమాండ్ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ బ్రాండ్ అయిన ఇన్‌ఫినిక్స్ మార్కెట్లో సరికొత్త ల్యాప్‌టాప్‌ను రిలీజ్ చేసింది. జీరో బుక్ 13 పేరుతో రిలీజ్ చేసిన ఈ ల్యాప్‌టాప్ ఆఫీస్ అవసరాలకు సరిగ్గా సరిపోతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ల్యాప్‌టాప్ ధర, ఇతర ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
జీరో బుక్ 13 సరికొత్త ఇంటెల్ కోర్ 13 జనరేషన్ హెచ్ సిరీస్ ప్రాసెసర్, 96 ఈయూ ఐరిస్ ఎక్స్‌ఈ ఇంటిగ్రేటెడ్ జీపీయూతో అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ జూలై 11 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇక ధర విషయానికి వస్తే జీరో బుక్ 13 కోర్ ఐ0 (32 జీబీ ర్యామ్+ 1టీబీ స్టోరేజ్) ధర రూ. 81,990గా ఉంది. అలాగే కోర్ ఐ7 ( 16జీబీ ర్యామ్+512 జీబీ) ధర రూ.64,999గా ఉంటే ఐ7(32 జీబీ ర్యామ్+1 టీబీ) రూ. 69,999 ఉంది. అలాగే కోర్ ఐ 5 వెర్షన్ 16 జీబీ ర్యామ్ + 512 జీబీ వేరియంట్ ధర రూ. 51,990గా ఉంది.
జీరో బుక్ 13 ల్యాప్‌టాప్ సిరీస్ ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌తో 15.6 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే డ్యూయల్ హై-ఫ్రీక్వెన్సీ 2 వాట్ స్పీకర్లు, ముందు భాగంలో డ్యూయల్ తక్కువ ఫ్రీక్వెన్సీ 1 వాట్ స్పీకర్లతో సూపర్ సౌండ్ క్వాలిటీతో ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఈ ల్యాప్‌టాప 100 వాట్స్ టైప్ సీ ఛార్జర్‌కు మద్దతుతో 70 డబ్ల్యూహెచ్ బ్యాటరీతో పని చేస్తుంది. అలాగే ఈ ల్యాప్‌టాప్ దాదాపు రెండు గంటల్లో పూర్తిగా చార్జ్ చేసేలా డీసీ చార్జర్ పాయింట్ కూడా ఉంటుంది. అలాగే కనెక్టివిటీ విషయానికి వస్తే ఒక ఎస్‌డీ స్లాట్, ఒక 3.5 ఎంఎం ఇయర్‌ఫోన్ స్లాట్, యూఎస్‌బీ 3.0 స్లాట్ ఉన్నాయి. ఇది 6 జీహెచ్‌జెడ్ మద్దతుతో వైఫైకి కూడా మద్దతు ఇస్తుంది. ఈ ల్యాప్‌టాప్ సిరీస్‌లో ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్‌తో కూడిన డ్యూయల్ మైక్ శ్రేణి కూడా ఉంది. అలాగ ల్యాప్‌టాప్‌ల పవర్ కీ బటన్‌పై ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..