Nasa Helicopter On Mars
NASA: ఎన్నో ఏళ్ల కల.. ఎవరూ సాధ్యం చేసుకోలేని రికార్డు నాసా సొంతం అయింది. అంగారకుడిపై అద్భుతాన్ని సృష్టించింది. తొలిసారిగా మార్స్ పై ఒక హెలికాప్టర్ ను ఎగరేసింది. భూమికి సుదూర తీరాల్లో.. అత్యంత చల్లని ప్రదేశంలో..హెలికాప్టర్ ను చక్కర్లు కొట్టించి ప్రపంచంతో చప్పట్లు కొట్టించుకుంది నాసా! తొలిసారిగా మరో గ్రహంపై హెలికాప్టర్ ఎగిరింది. భూమిపై తప్ప మరే గ్రహంపైనా ఎగరని హెలికాప్టర్ ను మార్స్ లో తిప్పింది నాసా. దీనికి సంబంధించిన ఫోటో విడుదల చేసింది. మార్స్ పై హెలికాప్టర్లు, విమానాలు ఎగిరేందుకు ఎలాంటి అవకాశం ఉందొ తెలుసుకోవడం కోసం ఈ ప్రయోగం చేపట్టింది నాసా. 19న తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అక్కడ హెలికాప్టర్ ఎగిరింది. అంగారక గ్రహం-భూమికి మధ్య దూరం 28 కోట్ల కిలోమీటర్లు ఉంది. అంత దూరం నుంచి డేటా రావాడానికి టైం పట్టింది. ఇప్పుడు హెలికాప్టర్ ఎగరడంతో నాసాకి డేటా అందుతోంది. మార్స్ హెలికాప్టర్‌ను జెపిఎల్ నిర్మించింది. నాసా ప్రధాన కార్యాలయానికి టెక్నికల్ ప్రాజెక్టును ఈ సంస్థనే ఇచ్చింది. నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్, ఏరోనాటిక్స్ రీసెర్చ్ మిషన్ డైరెక్టరేట్, స్పేస్ టెక్నాలజీ మిషన్ డైరెక్టరేట్ ఇందుకు అంగీకారం తెలిపాయి. నాసాలోని అమెస్ రీసెర్చ్ సెంటర్, లాంగ్లీ రీసెర్చ్ సెంటర్ దీన్ని అభివృద్ధి చేశాయి. విమాన పనితీరు విశ్లేషణ సాంకేతిక సహాయాన్ని అందించాయి.
“Wow!”
The @NASAJPL team is all cheers as they receive video data from the @NASAPersevere rover of the Ingenuity #MarsHelicopter flight: pic.twitter.com/8eH4H6jGKs
— NASA (@NASA) April 19, 2021
ప్రతికూల పరిస్థితుల్లో…
భూమిపై హెలికాప్టర్లు ఎగరడం సులువే కానీ మార్స్‌పై ఎగరడం అంత తేలిక కాదు. అక్కడి గాలిలో బలం ఉండదు. భూమిపై ఉండే గాలి ప్రెషర్‌తో పోల్చితే మార్స్‌పై ఉన్న గాలి ప్రెషర్ 1 శాతం తక్కువ. అసలు హెలికాప్టర్ ఎగరగలదా అని అనుమానం నాసా శాస్త్రవేత్తలకు ఉంది. కానీ నాసా ఆలోచనలను పటాపంచలు చేసిన హెలికాప్టర్. హెలికాప్టర్ గాలిలో ఎగరడంతో ఊపిరిపీల్చుకున్న పరిశోధకులు. పెర్సెవరాన్స్ రోవర్ పంపినప్పుడే హెలికాప్టర్ ను నాసా పంపించింది. ఏప్రిల్ 8 న రోవర్‌లో నుంచి తన రెక్కలను విప్పుకుని బయటకు వచ్చిన బుల్లి హెలికాప్టర్ ఇన్ జెన్యూనిటీ. ఈ హెలికాప్టర్ బరువు 1.8 కేజీలు మాత్రమె. 30 రోజుల పాటు మార్స్‌పై చక్కర్లు కొట్టనున్న హెలికాప్టర్. దీనిని ఎగిరేందుకు సిద్ధం చేయడానికి పట్టిన కాలం మాత్రం ఆరు రోజుల నాలుగు గంటలు. రోవర్‌లో ఉన్న ఈ హెలికాప్టర్‌ను బయటకు తీయడం కత్తిమీద సామే దానిని దిగ్విజయంగా పూర్తి చేశారు నాసా పరిశోధకులు. ఇక అక్కడి వాతావరణాన్ని ఈ హెలికాప్టర్ తట్టుకోవడం మరో టాస్క్. రాత్రి వేళల్లో అక్కడ మైనస్ 90 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. దానిని కూడా తట్టుకుంది ఈ హెలికాప్టర్. మార్స్‌పై 10 ఫీట్ల ఎత్తు వరకు ఈ హెలికాప్టర్ ఎగిరింది. ఈ హెలికాప్టర్ లో నావిగేషన్ వ్యవస్థతో పాటు.. అత్యాధునిక కెమెరాలు ఉన్నాయి. ఇది పంపే డేటాను కూడా విశ్లేషిస్తే.. మార్స్‌ను మరింత అర్థం చేసుకోవచ్చనేది సైంటిస్టుల మాట. ఇది ఫోటోలు తీయడానికి మాత్రమే పనికి వస్తోందని నాసా చెబుతోంది.
You wouldn’t believe what I just saw.
More images and video to come…#MarsHelicopterhttps://t.co/PLapgbHeZU pic.twitter.com/mbiOGx4tJZ
— NASA’s Perseverance Mars Rover (@NASAPersevere) April 19, 2021
జీవజాలం ఉందా…
మార్స్‌పై జీవజాలం ఉందా? లేదా ? అని తెలుసుకోవడానికి నాసా తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఒక్కసారి ఈ ప్రయోగం ఫలితాలు విశ్లేషించేందుకు నాసా ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ అంతా బాగుంటే…మనుషులు జీవించడానికి ఓకే అని చెప్పడమే ఆలస్యం.. వెంటనే మనుషులను తరలించడానికి మస్క్ టీమ్ ను రెడీ చేసింది నాసా. అక్కడ కాలనీలు నిర్మించడానికి అబీబో టీమ్ రెడీగా ఉంది.
ఏం చేస్తారంటే…
పురాతన సూక్ష్మజీవుల ఉనికి పై విశ్లేషణ చేస్తారు. అక్కడ జీవజాలం ఉందా లేదా ఉంటే ఎలా ఉంది..ఎంత కాలం కిందట ఉందనే అంశాల పై పరిశోధనలు చేస్తారు. వివిధ సంకేతాల అన్వేషణతో అంగారక గ్రహం లెక్కలు తెలనున్నాయి. అక్కడున్న భూగర్భం, వాతావరణాన్ని నాసా విశ్లేషిస్తుంది. అక్కడ విరిగిపోయి ఉన్న రాళ్లు, దుమ్మును సేకరిస్తున్న నాసా. నాసా మిషన్లు, ESA (యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ) సహకారంతో పరిశోధన చేస్తోంది. అక్కడి ఉపరితలం నుండి సేకరించిన మట్టి పై లోతైన విశ్లేషణ సాగిస్తోంది. భూమికి తిరిగి రావడానికి అంగారక గ్రహానికి నాసా మరో శాటిలైట్ ను పంపించనుంది.
ఆ సంఘటనకు గుర్తుగా..
1903లో తొలిసారి విమానాన్ని రైట్ సోదరులు భూమి పై ఎగురేశారు. కాలిఫోర్నియాలోని కిట్టీ హాక్ దగ్గర రైట్ బ్రదర్స్ ఎగురవేసి చరిత్ర సృష్టించారు. దానికి గుర్తుగా.. 1903లో ఎగిరిన విమానం తాలూకు చిన్న ముక్కను నాసా ఆ హెలికాప్టర్‌లో ఉంచింది. రైట్ సోదరులకు గౌరవ సూచకంగా నాసా ఈ విధంగా చేసింది.
Also Read: అనుమానాస్పద నౌకపై కోస్ట్ గాడ్స్ దాడి.. రూ.3,000 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల స్వాధీనం
మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారందరకీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని బట్టి ఈ తేదీలు మారే అవకాశం కనిపిస్తోంది.