AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mixer Grinder Cleaning Tips: వార్నీ ఇన్ని రోజులు ఈ టిప్స్‌ తెలియకపాయే.. ఇలా ఇంట్లోనే మిక్సీని సులభంగా క్లీన్‌ చేసుకోండి!

Mixer Grinder Cleaning Tips: మిక్సీ గ్రైండర్ జార్లను, మోటారును డీప్ క్లీనింగ్ చేయడం ఎలాగో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా కడిగేసినా లోపల పేరుకుపోయే మురికిని తొలగించి, పసుపు రంగులోకి మారిన మూతలను తెల్లగా మార్చడానికి సులువైన పద్ధతులు ఉన్నాయి. ఇంట్లో ఉండే పదార్థాలతో తక్కువ శ్రమతో మీ మిక్సీని కొత్తదానిలా మెరిపించుకోవచ్చు..

Mixer Grinder Cleaning Tips: వార్నీ ఇన్ని రోజులు ఈ టిప్స్‌ తెలియకపాయే.. ఇలా ఇంట్లోనే మిక్సీని సులభంగా క్లీన్‌ చేసుకోండి!
Mixer Grinder Cleaning Tips
Subhash Goud
|

Updated on: Feb 17, 2026 | 5:14 PM

Share

Mixer Grinder Cleaning Tips: గృహిణులకు వంటింట్లో మిక్సీ గ్రైండర్ ఒక ముఖ్యమైన గాడ్జెట్‌. ప్రతి రోజు దీని అవసరం ఎంతో ఉంటుంది. దీని జార్లను, మోటారును కేవలం సాధారణంగా కడిగి పక్కన పెట్టడం వల్ల కాలక్రమేణా అనేక సమస్యలు తలెత్తుతాయి. రబ్బరు బెల్టుల కింద, బ్లేడ్ల చుట్టూ, జార్ల లోపలి, బయటి భాగాల్లో మిక్సి పట్టిన తర్వాత పదార్థాలు పేరుకుపోవడం, నూనె జిడ్డు పేరుకుపోయి గార, పసుపు రంగు, ఫంగస్ ఏర్పడతాయి. ఇది మిక్సీ జార్ల మన్నికను తగ్గించి, వాటి పనితీరును ప్రభావితం చేస్తుంది. మిక్సీ ఖరీదైన వస్తువు కాబట్టి, దానిని కనీసం పదేళ్ల పాటు రిపేర్లు లేకుండా ఉపయోగించుకోవాలంటే నెలకోసారి డీప్ క్లీనింగ్ చేయడం తప్పనిసరి అని చెబుతున్నారు టెక్నీసియన్స్.

డబ్బు ఆదా, ఎక్కువ మన్నిక:

మిక్సీ జార్లను తరచుగా మార్చడం ఖర్చుతో కూడుకున్న పని. రబ్బరు బెల్టుల కింద, మూతలపై పేరుకుపోయిన పసుపు రంగు, బ్లేడ్లపై ఎర్రటి గార, బేస్ భాగంలో నల్లగా పట్టేసిన ఫంగస్ వంటివి మిక్సీని అపరిశుభ్రంగా, అనాకర్షణీయంగా మార్చుతాయి. అంతేకాదు క్లీనింగ్‌ చేయకపోతే త్వరగా పాడైపోతాయి. వీటిని సులభంగా శుభ్రం చేయడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఎలా జాగ్రత్తపడాలో ట్రిక్స్‌ ఉపయోగపడతాయి. మిక్సీ మోటారుకు బయట కూడా అంతే శ్రద్ధ వహించడం ముఖ్యం. మోటారు బాగా పనిచేస్తేనే మిక్సీ ఎక్కువ కాలం పనిచేస్తుంది.

క్లీనింగ్‌కు అవసరమైనవి:

1. నీళ్లు: మూడు లీటర్ల మంచి నీరు (బోర్ నీళ్లు లేదా ఉప్పు నీళ్లు వద్దు).

ఇవి కూడా చదవండి

2. డిటర్జెంట్ పౌడర్: రెండు స్పూన్లు (సర్ఫ్, టైడ్, రిన్, ఏరియల్ వంటివి లేదా లిక్విడ్ డిటర్జెంట్ అయితే ఒక క్యాప్).

3. బేకింగ్ సోడా (వంట సోడా): రెండు స్పూన్లు.

4. ఉప్పు: రెండు స్పూన్లు.

5. వైట్ వెనిగర్: ఒక చిన్న టీ గ్లాసుడు.

మిక్సీ జార్ల డీప్ క్లీనింగ్ విధానం:

1. ఒక పెద్ద పాత్రలో మూడు లీటర్ల మంచి నీటిని తీసుకోండి.

2. నీటిలో రెండు స్పూన్ల డిటర్జెంట్ పౌడర్, రెండు స్పూన్ల బేకింగ్ సోడా, రెండు స్పూన్ల ఉప్పు వేసి బాగా కలపండి.

3. ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి బాగా మసలబెట్టండి. నీళ్లు బాగా ఉడికి, ఒక పొంగులాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.

4. మరిగిన నీటిలో ఒక చిన్న టీ గ్లాసుడు వైట్ వెనిగర్‌ను నెమ్మదిగా కలుపుకోండి. ఒకేసారి వేయకుండా కొద్దికొద్దిగా వేయడం వల్ల పొంగిపోకుండా ఉంటుంది.

5. మిక్సీ జార్లు, వాటి రబ్బరు బెల్టులు, మూతలు (ప్లాస్టిక్ కానివి, ట్రాన్స్‌పరెంట్ మెటీరియల్ ఉన్నవి మాత్రమే) ఒక వెడల్పాటి గిన్నెలో మునిగేలా అమర్చండి. ప్లాస్టిక్ మూతలు వేడికి కరిగిపోయే అవకాశం

ఉంది కాబట్టి, వాటిని విడిగా శుభ్రం చేయాలి.

6. మరిగిన డిటర్జెంట్ నీటిని మిక్సీ జార్లలో అవి మునిగేలా పోయండి. ముఖ్యంగా బ్లేడ్ల చుట్టూ, బేస్ భాగంలో పేరుకుపోయిన మురికిని వదిలించుకోవడానికి లోపలికి బాగా పోయాలి.

7. జార్లను ఇలా అరగంట పాటు నానబెట్టాలి. ఈ సమయంలోనే మురికి చాలా వరకు వదులుకుంటుంది.

మిక్సీ మోటారు క్లీనింగ్ విధానం:

1. జార్లను నానబెట్టిన తర్వాత మిగిలిన డిటర్జెంట్ నీటిని ఒక మగ్‌లో పక్కన పెట్టుకోండి.

2. ఒక పాత టూత్ బ్రష్‌ను ఈ డిటర్జెంట్ నీటిలో ముంచి, మిక్సీ మోటారు బయటి భాగాలను జాగ్రత్తగా రుద్దండి. మోటారు లోపలికి నీరు అస్సలు వెళ్లకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది మోటారును దెబ్బతీస్తుంది.

3. మోటారు వైరు, ఎయిర్ వెంట్ల చుట్టూ పేరుకుపోయిన దుమ్ము, మురికిని టూత్ బ్రష్, టూత్ పిక్ సహాయంతో తొలగించండి. టూత్ పిక్ ఉపయోగించి చిన్న సందులలోని మురికిని బయటకు తీయవచ్చు.

4. శుభ్రం చేసిన తర్వాత పొడి గుడ్డతో మోటారును తుడువండి. తడి గుడ్డతో తుడవడం అవసరం లేదు. పొడి గుడ్డనే వాడాలి.

క్లీనింగ్ తర్వాత జార్లను శుభ్రపరచడం:

నానబెట్టిన అరగంట తర్వాత జార్లలోని మురికి చాలా వరకు వదిలిపోయి ఉంటుంది. బలమైన పీచులు వాడకుండా, అదే పాత టూత్ బ్రష్‌తో సులువుగా జార్లను రుద్దండి. బ్లేడ్ల చుట్టూ పేరుకుపోయిన గారను, రబ్బరు బెల్టుల కింద ఉన్న మురికిని బ్రష్‌తో తేలికగా తొలగించవచ్చు. చేతి గోరుతో అంటే కూడా గార సులువుగా ఊడి వస్తుంది. చివరగా, జార్లను మంచి నీటితో శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. ఈ పద్ధతిలో శుభ్రం చేయడం వల్ల మీ మిక్సీ జార్లు కొత్తదానిలా మెరుస్తాయి.

ఈ సులభమైన డీప్ క్లీనింగ్ పద్ధతిని నెలకొకసారి పాటించడం వల్ల మీ మిక్సీ గ్రైండర్ ఎక్కువ కాలం మన్నిగ్గా ఉండి, ఎటువంటి సమస్యలు లేకుండా మీకు సర్వీసు అందిస్తుంది. ప్రీతి వంటి బ్రాండెడ్ మిక్సీల మన్నికకు ఈ రకమైన సంరక్షణ చాలా ముఖ్యం.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us