ప్రస్తుతం భారత్‌లో టీవీల విషయానికి వస్తే స్మార్ట్ టీవీల హవా నడుతస్తుంది. కచ్చితంగా ఎవరూ కొన్నా స్మార్ట్ టీవీ కొనుగోలు మొగ్గు చూపుతున్నారు. కంపెనీలు కూడా అన్ని స్మార్ట్ టీవీలనే అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ప్రస్తుతం వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మెరుగైన పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ, సూపర్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం అన్ని కంపెనీలు కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్స్‌లో తమ సత్తా చాటిన ఎంఐ కంపెనీ ప్రస్తుతం విరివిగా స్మార్ట్ టీవీలను రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో టీవీలు రిలీజ్ చేయడంతో అధిక మార్కెట్ సొంతం అయ్యింది. 2023లో కొత్త ఆర్థిక సంవత్సరం సందర్భంగా ఎంఐ ఎక్స్ ప్రో సిరీస్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. 43, 50, 55 అంగుళాల మోడల్స్‌లో ఈ టీవీలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఇవి 30 కంటే ఎక్కువ ప్రొవైడర్‌లలో కంటెంట్‌ను అందించే ఎంఐ సొంత ప్యాచ్‌వాల్ టెక్నాలజీతో పాటు ఆండ్రాయిడ్ సపోర్టెడ్‌గా ఉంటాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే డాల్బీ విజన్ ఐక్యూ, వివిడ్ పిక్చర్ ఇంజిన్2 సాంకేతికతతో వినియోగదారులకు సూపర్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్‌కను అందిస్తాయని పేర్కొంటున్నారు. అలాగే డాల్బీ అట్మాస్ మద్దతుతో గరిష్టంగా 40 వాట్స్ స్పీకర్ సిస్టమ్‌తో వస్తాయి. అలాగే మినిమలిస్టిక్, మెటాలిక్ ఇండస్ట్రియల్ డిజైన్‌తో ఆకట్టుకునేలా ఉంటాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దాదాపు 96.6 శాతం అధిక స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో ఈ టీవీలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్‌లతో పాటు కార్బన్ ఫైబర్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్ వల్ల ఈ టీవీలకు సొగసైన రూపాన్ని అందిస్తాయి.
ఈ టీవీలు ఎంఐ వెబ్‌సైట్‌తో పాటు, ఫ్లిప్ కార్ట్‌లో కొనుగోలు అందుబాటులో ఉంటాయి. అలాగే 43 అంగుళాల టీవీ ధర రూ.32999 కాగా, 50 అంగుళాల టీవీ ధర రూ.41999, 55 అంగుళాల టీవీ ధర రూ. 47,999గా ఉంటుంది. అలాగే 43 అంగుళాల టీవీకి రూ.1500 బ్యాంక్ ఆఫర్, 50, 55 అంగుళాల టీవీలను రూ.2000 తక్షణ తగ్గింపు పొందవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..