ISRO: భారత్ తలపెట్టిన గగన్ యాన్-1 మరింత ఆలస్యం.. అసలు కారణమిదే..

|

Jul 10, 2022 | 6:36 PM

ISRO: అంతరిక్ష ప్రయోగల్లో అనేక రికార్డులు సొంతం చేసుకుంది ఇస్రో. మానవ రహిత ప్రయోగల్లో రికార్డ్ స్థాయిలో ఉపగ్రహాలను ఒకేసారి..

ISRO: భారత్ తలపెట్టిన గగన్ యాన్-1 మరింత ఆలస్యం.. అసలు కారణమిదే..
Isro
Follow us on

ISRO: అంతరిక్ష ప్రయోగల్లో అనేక రికార్డులు సొంతం చేసుకుంది ఇస్రో. మానవ రహిత ప్రయోగల్లో రికార్డ్ స్థాయిలో ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపిన ఘనత ఇస్రోది. అందకే.. మరో చరిత్ర సృష్టించేందుకై మానవ సహిత ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అయితే 2022 లొనే జరగాల్సిన ఈ మ్యాన్ మిషన్ మరింత అలస్యమవుతోంది. ఫలితంగా భారత్ కల నెరవేరేందుకు మరింత సమయం పడుతుంది.

తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్. అంతరిక్ష పరిశోధనలు.. ఎన్నో సంచలన ప్రయోగాలకు వేదికగా నిలిచిన ప్రాంతం ఇది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇప్పుడు మానవ సహిత ప్రయోగాలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది ఇస్రో. గగన్ యాన్ పేరిట ఇస్రో GSLV MK.3 ద్వారా ఇస్రో 2022 చివరికల్లా ఈ ప్రయోగంను చేపట్టాలని నిర్ణయించారు. అయితే కరోనా కారణంగా ఇస్రో చేపడుతున్న సాధారణ ప్రయోగాలతో పాటు గగన్ యాన్ పై కూడా ప్రభావం చూపింది.

కాగా, గగన్ యాన్ ప్రయోగం సక్సెస్ చేసే దిశగా ఇస్రో ముందస్తుగా భూస్థిర పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఐదు పరీక్షలు నిర్వహించి విజయవంతం చేశారు. మరికొన్ని భూస్థిర పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇకపై శాస్త్రవేత్తలను అంతరిక్షంలో పరిశోధనల కోసం ఈ గగన్ యాన్..1 ప్రయోగంను చేపట్టనుంది. 2023 చివర్లో కనీసం ప్రయోగం కోసం ప్రయత్నాలను ముమ్మరం చేసింది ఇస్రో. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన GSLV MK.3 రాకెట్ ప్రయోగం ద్వారా ఈ ప్రయోగాన్ని చేసేందుకు అనేక పరీక్షలు చేసి రాకెట్ సామర్ధ్యాలను శాస్త్రవేత్తలు పరీక్షిస్తున్నారు.

గగన్ యాన్ ప్రయోగానికి సంబంధించి భారత ప్రభుత్వం10 వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ప్రయోగమే కాకుండా ఇస్రో భవిష్యత్తు లో వ్యోమగాములను అంతరిక్షంలో కి పంపేందుకు సన్నద్ధమౌతోంది. ఈ గగన్ యాన్ -1 ప్రయోగానికి సంబంధించి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని SPROB నందు ఘన ఇంధన మోటార్ టెస్టును కూడా విజయవంతంగా నిర్వహించారు శాస్త్రవేత్తలు. ఈ భారీ ప్రయోగానికి ఉపయోగించే S 200 STRAAFFON BOOSTERS, రెండవ దశలో ఉపయోగించే L110 సామర్థ్యంతో పాటు 3.5 టన్నుల బరువు గల CREW మోడ్యూల్( వ్యోమగాములు గది) కూడా తయారు చేశా శాస్త్రవేత్తలు. GSLV రాకెట్ ద్వారా గాలిలోకి పంపి నాలుగు దశలు మండించి అంతరిక్షం వైపునుకు పంపి ప్యారాచూట్ల సహాయంతో CREW మాడ్యూల్‌ను బంగాళాఖాతంలోకి వదిలి, దాన్ని పడవల సహాయంతో తిరిగి భూమి మీదకు తీసుకుని వచ్చారు. ఇలా CREW మాడ్యూల్ టెస్టును కూడా విజయవంతంగా నిర్వహించారు.

ఈ గగన్ యాన్ ప్రయోగంలో ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ఇస్రో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయోగ సమయంలో ప్యారాచూట్లను ఉపయోగించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇస్రో శాస్త్రవేత్తలు GSLV MK.3 గగన్ యాన్ ప్రయోగంలో ఉపయోగించే మూడవ దశలోని క్రాయోజనిక్ ఇంజన్‌కు సంబంధించిన పరీక్షలు తమిళనాడులోని ఇస్రో కు చెందిన ప్రొపెల్షాన్ సెంటర్ నందు విజయవంతంగా నిర్వహించారు. అదే విధంగా ఈ ప్రయోగానికి సంబంధించి ఇంకా కొన్ని భూ పరీక్షలు చేయాల్సి ఉంది. ఈ పరీక్షలు అన్ని నిర్వహించిన పిదప ఇస్రో గగన్ యాన్.1 ప్రయోగ తేదీని ప్రకటించనుంది. ఇస్రో తలపెట్టిన గగన్ యాన్ ప్రయోగంపై యావత్ భారతావని గర్వంగా ఎదురు చూస్తుండగా.. ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి.

మరిన్ని సైన్స్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..