Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LG AI Robot: చిట్టి చిట్టి రోబో.. మీ జట్టు కట్టే రోబో.. ఇంట్లో ఏ పనైనా ఇట్టే చేసేస్తుంది..

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ కంపెనీ ఎల్‌జీ ఓ కీలక ప్రకటన చేసింది. ఏఐ ఆధారిత రోబోట్‌ను రూపొందించినట్లు ప్రకటించింది. దీనిని సీఈఎస్ 2024 వేదికగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లె చెప్పింది. ఎల్‌జీ ఈ రోబోట్ ను స్మార్ట్ హోం అసిస్టెన్స్ కోసం వినియోగించనుంది. అంటే ఇంటి పనులకు ఉపకరించే విధంగా దీనిని తీసుకొస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఈ రోబోట్ ఇంట్లో మనుష్యులతో కలిసిపోతోంది.

LG AI Robot: చిట్టి చిట్టి రోబో.. మీ జట్టు కట్టే రోబో.. ఇంట్లో ఏ పనైనా ఇట్టే చేసేస్తుంది..
Lg Smart Home Ai Robot
Follow us
Madhu

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jan 02, 2024 | 9:55 PM

ఆధునిక సాంకేతికత మనిషి పనిని సులభతరం చేస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రాకతో పనుల వేగం చాలా పెరిగింది. క్షణాల్లో మనిషి చేసినట్లు చేసే పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అయితే దీనిపై కొంత ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్న మాట వాస్తవం. ఈ ఏఐ మనిషిని రిప్లేస్ చేస్తే భారీగా ఉద్యోగాలు కోల్పోతారన్న భయం మనిషిని వెంటాడుతోంది. అయితే ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వాటి సేవలు అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ కంపెనీ ఎల్‌జీ ఓ కీలక ప్రకటన చేసింది. ఏఐ ఆధారిత రోబోట్‌ను రూపొందించినట్లు ప్రకటించింది. దీనిని సీఈఎస్ 2024 వేదికగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లె చెప్పింది. ఎల్‌జీ ఈ రోబోట్ ను స్మార్ట్ హోం అసిస్టెన్స్ కోసం వినియోగించనుంది. అంటే ఇంటి పనులకు ఉపకరించే విధంగా దీనిని తీసుకొస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఈ రోబోట్ ఇంట్లో మనుష్యులతో కలిసిపోతోంది. వారితో కలిసి పనులు చేస్తుంది. కొత్త విషయాలు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ, ఇంట్లో వారు చెప్పే ఆదేశాలను పాటిస్తుంది. అలాగే ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెంపుడు జంతువుల ఆలనా పాలనా కూడా చక్కగా చూసుకుంటాయి. ఇంటికి భద్రతను కూడా కల్పిస్తాయని ఎల్‌జీ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎల్‌జీ ఏఐ రోబోట్..

ఎల్‌జీ ఈ స్మార్ట్ హోం అసిస్టెంట్ ను రోబో లుక్లో డిజైన్ చేసింది. చక్రాలు, కాళ్లను దానికి అమర్చింది. తన యజమాని తనకు అప్పగించిన పనిని ఎంచక్కా చక్కబెడుతుంది. ఇంట్లోని మనుషులతో మాట్లాడుతుంది. తన హావభావాలతో ఆకట్టుకుటుంది. మీరు చెబుతున్న అంశాలను అర్థం చేసుకుంటుంది. చిత్రాలను గుర్తు పెట్టుకుంటుంది. ఇది మీ ఇంట్లో ఓ కంట్రోల్ సెంటర్ గా వ్యవహరిస్తుంది. స్మార్ట్ అప్ల‌య‌న్సెస్‌, డివైజ్‌ల‌ను అన్నింటిని దీనికి క‌నెక్ట్ చేసుకోవచ్చు. మీ ఎప్పుడైనా ఇంట్లో లేకుండా ఉంటే ఇంట్లో అన్ని వస్తువులను చక్కగా అమర్చుతుంది. లైట్లు, ఫ్యాన్లు, ఏసీలను ఆఫ్ చేస్తుంది. అందుకోసం దీనిలో క్వాల్ కాం టెక్నాలజీస్ ఆధ్వర్యంలో రూపొందించిన పవర్ ఫుల్ సిస్టమ్ ఉంటుంది. ఇది యజమాని ఎవరనేది బాగా గుర్తుపెట్టుకుంటుంది. అందుకోసం ఇది కెమెరా, సెన్సార్లను కలిగి ఉంటుంది. దీనిని ఈ 2024లోనే మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

ప్రత్యేకత ఇదే..

ఈ స్మార్ట్ హోం అసిస్టెంట్ రోబోటిక్స్ పై పనిచేస్తుంది. ఏఐతో పాటు మల్టీ-మోడల్ టెక్నాలజీతో ఇది వస్తుంది. ఇది ఆల్ రౌండర్ అని కంపెనీ ప్రకటించింది. దీని ద్వారా వినియోగదారులకు జీరో లేబర్ హోమ్‌ను అందించాలని కంపెనీ భావిస్తోంది. అంటే ఇప్పుడు మీకు హౌస్‌కీపర్స్ అవసరం లేదు.

ఇవి కూడా చదవండి

డిజైన్ ఇలా ఉంటుంది.

ఈ ఏఐ రోబోట్ కి రెండు కాళ్లు ఉంటాయి. దానికి చిన్న చక్రాలు అమర్చబడి ఉంటాయి. వాటి సహాయంతో రోబోట్ కదలగలగుతుంది. వ్యక్తులతో కమ్యూనికేట్ చేయగలగుతుంది. భావోద్వేగాలను కూడా అర్థం చేసుకోగలగుతుంది. వాయిస్, ఇమేజ్ రికగ్నిషన్‌తో పాటు సహజ భాషా ప్రాసెసింగ్ ద్వారా విషయాలను అర్థం చేసుకోగలుగుతుంది.

ఇంట్లో ఎవరూ లేనప్పుడు..

మీరు ఇంట్లో లేనప్పుడు, రోబోట్ కిటికీ తెరిచి ఉందా లేదా లైట్లు ఆన్‌లో ఉందో లేదో తనిఖీ చేస్తూ చుట్టూ తిరుగుతుంది. ఇది ఉపయోగించని వస్తువులను ఆఫ్ చేయడం ద్వారా విద్యుత్తును ఆదా చేయడంలో కూడా సహాయపడుతుంది. మీరు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఇది మిమ్మల్ని పలకరిస్తుంది. మీ మానసిక స్థితిని పసిగట్టగలుగుతుంది. పాటలు ప్లే చేస్తుంది. అత్యవసర పనుల రిమైండర్‌లను అందిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..