Upcoming Apple Products: యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త సంవత్సరంలో కొత్త ఉత్పత్తుల జాతర..
కొత్త సంవత్సరం కొత్త ఉత్పత్తులకు ఆహ్వానం పలుకుతోంది. అన్ని రంగాల్లో నూతన వస్తువులు లాంచ్ కానున్నాయి. అందులో భాగంగా ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కూడా పలు ఆసక్తికరమైన ఉత్పత్తులను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వాటిల్లో ప్రధానమైనది ఐఫోన్ 16. ఇటీవల యాపిల్ ప్రారంభించిన యాపిల్ 15 సిరీస్ కు అప్ గ్రేడెడ్ వెర్షన్. అంతేకాక ఎం3 చిప్ తో కూడిన కొత్త మ్యాక్ బుక్ ఎయిర్ ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

కొత్త సంవత్సరం కొత్త ఉత్పత్తులకు ఆహ్వానం పలుకుతోంది. అన్ని రంగాల్లో నూతన వస్తువులు లాంచ్ కానున్నాయి. అందులో భాగంగా ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కూడా పలు ఆసక్తికరమైన ఉత్పత్తులను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వాటిల్లో ప్రధానమైనది ఐఫోన్ 16. ఇటీవల యాపిల్ ప్రారంభించిన యాపిల్ 15 సిరీస్ కు అప్ గ్రేడెడ్ వెర్షన్. అంతేకాక ఎం3 చిప్ తో కూడిన కొత్త మ్యాక్ బుక్ ఎయిర్ ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఓఎల్ఈడీ డిస్ ప్లే తో కొత్త యాపిల్ స్మార్ట్ వాచ్ ఎక్స్ తో పాటు ఐ ప్యాడ్ ప్రో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2024లో మార్కెట్లోకి రానున్న యాపిల్ ఉత్పత్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఐఫోన్ 16 లాంచింగ్..
2024, సెప్టెంబర్లో యాపిల్ నుంచి కొత్త ఐఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఐఫోన్ 15 2023లో సెన్సేషన్ సృష్టించింది. అయితే దీని అప్ గ్రేడెడ్ వెర్షన్ పై ఇప్పటికే చాలా పుకార్లు మార్కెట్లో ఉన్నాయి. ఐఫోన్ 16కు సంబంధించిన కొన్ని ఆన్ లైన్ లీక్ లను పరిశీలిస్తే డిజైన్ లో కొన్ని అప్ గ్రేడ్లు ఉండే అవకాశం ఉంది. అలాగే కెమెరా విషయంలోనూ కొత్తగా క్యాప్చర్ బటన్ ను తీసుకురానున్నట్లు చెబుతున్నారు. అలాగే యాక్షన్ బటన్ అనే కొత్త ఆప్షన్ ను కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే ప్రో మోడల్లో కెమెరా జూమ్ సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు తెలుస్తోంది. అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ, కొత్త చిప్ సెట్, అధిక రిఫ్రెష్ రేట్ తో కూడిన డిస్ ప్లే, మెరుగైన కెమెరా ఉంటుందని సమాచారం. అయితే దీనిలో ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుందో లేదో తెలియదు. అలాగే రాబోయే యాపిల్ ఫోన్లలో ఏఐ సపోర్టు కూడా ఉంటుందని చెబుతున్నారు.
ఎం3 చిప్‌తో మ్యాక్‌బుక్ ఎయిర్..
2024లో ఆపిల్ ఎం3 చిప్‌సెట్‌తో కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్‌ను విడుదల చేయనుంది. ఇటీవల 15-అంగుళాల మాక్‌బుక్ ఎయిర్‌ను ప్రారంభించినప్పటికీ, దీనిలో పాత ఎం2 చిప్‌ని అమర్చింది. రాబోయే నెలల్లో మ్యాక్‌బుక్ ఎయిర్‌కు మరింత అధునాతన ఎం3 చిప్‌లను పరిచయం చేయడం ద్వారా కంపెనీ ఈ ఏడాది మోడల్‌తో దీన్ని మార్చాలని భావిస్తోంది. మ్యాక్‌బుక్ ఎయిర్ ప్రాథమికంగా వెబ్ బ్రౌజింగ్, డాక్యుమెంట్ రైటింగ్‌కు సరిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం ఎం3 చిప్ ఉపయోగపడుతుందని యాపిల్ చెబుతోంది. అలాగే వీడియో ఎడిటింగ్ కూడా బాగా ఉపకరిస్తుందని, దీనిలో ల్యాప్ టాప్ కంటే వేగంగా పనిచేస్తుంది.
ఐప్యాడ్ ప్రో 2024 మోడల్..
దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న యాపిల్ ఉత్పత్తుల్లో ఐప్యాడ్ ప్రో అప్ గ్రేడ్ కూడా ఒకటి. ఎట్టకేలకు ఈ ఏడాది దీనిలో ఓఎల్ఈడీ డిస్ ప్లేను పరిచయం చేస్తుందని భావిస్తున్నారు. ఐప్యాడ్ మినీ, స్టాండర్డ్ ఐప్యాడ్, ఐప్యాడ్ ఎయిర్ లతో పాటు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐప్యాడ్ ప్రోతో సహా 2024లో కొత్త ఐప్యాడ్‌ల శ్రేణిని ప్రారంభించాలనే యాపిల్ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. దీనిలో సరికొత్త యాపిల్ సిలికాన్ ఎం3 చిప్ ఉంటుంది. ఇది 2024 రెండో త్రైమాసికంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.
ఆపిల్ వాచ్ ఎక్స్..
రీ డిజైన్ చేసిన యాపిల్ వాచ్ ఎక్స్ 2024లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆన్ లైన్లో అందుతున్న సమాచారం ప్రకారం రీడిజైన్ మాగ్నెటిక్ బ్యాండ్ అటాచ్ మెంట్ సిస్టమ్ తో ఇది వస్తుంది. ఆరోగ్య పరమైన ఫీచర్లు ఉంటాయి. స్లీప్ అప్నియా డిటెక్షన్, హైపర్ టెన్షన్ కోసం బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంటుంది. మిగిలిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
యాపిల్ జీపీటీ..
చాట్ జీపీటీ లాంటి సర్వీస్ అభివృద్ధి చేసేందుకు యాపిల్ ప్రయత్నాలు ప్రారంభించింది. సరికొత్త ఏఐ మోడల్ ను ఆవిష్కరించే పనిలో పడింది. దానికి యాపిల్ జీపీటీ అని పేరును ఫిక్స్ చేసింది. దీనిలో ఈ వినూత్న సాధనం ఉద్యోగులకు ఫీచర్‌లను పరీక్షించడంలో, వచనాన్ని సంగ్రహించడంలో , నిల్వ చేసిన డేటా ఆధారంగా సమాధానాలను అందించడంలో సహాయపడుతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..