AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Last Selfie: భూమిపై చివరి సెల్ఫీ ఎలా ఉంటుందో తెలుసా? AI అందించిన ఫొటోలు చూస్తే.. భయపడాల్సిందే..

DALL-E ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ చివరి సెల్ఫీని రూపొందించమని కోరింది. ఆ తర్వాత అది కొన్ని ఫొటోలను నెటిజన్ల ముందు ఉంచింది. ఇవి చూసిన జనాలు షాకవుతున్నారు.

Last Selfie: భూమిపై చివరి సెల్ఫీ ఎలా ఉంటుందో తెలుసా? AI అందించిన ఫొటోలు చూస్తే.. భయపడాల్సిందే..
Last Selfie
Venkata Chari
|

Updated on: Jul 31, 2022 | 6:32 PM

Share

సెల్‌ఫోన్స్‌లో ఫ్రంట్ కెమెరా వచ్చినప్పటి నుంచి సెల్ఫీల పిచ్చి జనాలకు అంటుకుంది. ప్రస్తుతం ఈ ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. జనాలు ఎక్కడ ఉన్నా సరే.. సెల్ఫీలు తీసుకోవడం మాత్రం మానడం లేదు. ఇదంతా పక్కన పెడితే.. ప్రపంచంలోని చివరి సెల్ఫీ ఎలా ఉంటుందో చూడాలని ఉందా? అయితే, ఇప్పుడే చూసేద్దాం. కానీ, ఈ ఫొటోలు చూస్తే మాత్రం మీరు చాలా భయపడిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూమిపై చివరి సెల‌్ఫీ ఎలా ఉంటుందో చూపించింది. ప్రస్తుతం ఏఐ అన్నింటిలోనూ దూసుకపోతోంది. ప్రపంచం అంతా ఏఐతోనే నడుస్తుందంటే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇమేజ్ జనరేటర్ కోసం AI DALL-E 2 ఉపయోగించారు. భూమి చివరి సెల్ఫీ ఎలా ఉంటుందని ఏఐని అడిగితే, దాని ఫలితాలు అంత బాగా రాలేదంట. కాగా ప్రశ్నపై, AI అనేక చిత్రాలను రూపొందించింది.

ఇవి కూడా చదవండి

రోబో ఓవర్‌లార్డ్స్ అనే టిక్‌టాక్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ ఫొటోలను రూపొందించారు. అయితే, ఈ ఫొటోలలో భూమిపై జరుగుతోన్న విధ్వంసం కూడా చూపించారు. ఇదే సమయంలో ప్రజలు చేతిలో మొబైల్ పట్టుకుని సెల్ఫీలను తీస్తున్నట్లు చూడొచ్చు.

DALL-E అంటే ఏమిటి? చివరి సెల్ఫీ ఎలా అంచనా వేశారు?

కృత్రిమ మేధస్సు(ఏఐ) వ్యవస్థను చివరిగా తీసుకోవాల్సిన సెల్ఫీని రూపొందించమని DALL-E కోరింది. దీనికి భూమిపై చివరిసారిగా తీసుకునే సెల్ఫీని సిద్ధం చేసి, ఆశ్చర్యపరించింది. Google సర్వర్‌ల నుంచి అందిన సమాచారం ఆధారంగా, ఈ ఫోటోలను సిద్ధం చేసింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఊహించిన సెల్ఫీలను‌ ఈ ట్వీట్‌ నుంచి చూడొచ్చు.

భూమిపై మనుషులు నిల్చున్న చుట్టుపక్కల వినాశనం జరుగుతున్న ఫొటోలను ఇదిచూపించింది. అయితే, ఇదే సమయంలో ప్రజలు ఫోన్‌లతో జరుగుతున్న వినాశకరమైన దృశ్యాలను చూపిస్తూ సెల్ఫీలను తీసుకుంటున్నట్లు చూడొచ్చు.

ఈ AI సిస్టమ్ 12-బిలియన్ పారామీటర్ వెర్షన్ GPT-3ని ఉపయోగించింది. ఇంజనీర్లు OpenAI GPT-3 మోడల్‌ని ఉపయోగించి DALL-Eని నిర్మించారు. దీనితో, ఇది టెక్స్ట్ ఇన్‌పుట్ ఆధారంగా ఫొటోలను రూపొందిస్తుంది.