Bikes: బైక్స్‌ అన్నీ పెట్రోల్‌తో నడుస్తాయి.. కానీ డీజిల్‌తో నడిచే బైక్‌లు ఎందుకు రావడం లేదు..?

Bikes: నేడు మార్కెట్‌లో అనేక మోడళ్ల బైక్‌లు అమ్ముడవుతున్నాయి. సీసీ, ఇంజన్ పవర్, డిజైన్ బట్టి రక రకాల బైక్‌లు ఉన్నాయి.. అయితే వీటన్నిటికి ఒక కనెక్టివిటీ ఉంది. ఇవన్నీ

Bikes: బైక్స్‌ అన్నీ పెట్రోల్‌తో నడుస్తాయి.. కానీ డీజిల్‌తో నడిచే బైక్‌లు ఎందుకు రావడం లేదు..?
Petrol Engine

Updated on: Nov 20, 2021 | 6:03 AM

Bikes: నేడు మార్కెట్‌లో అనేక మోడళ్ల బైక్‌లు అమ్ముడవుతున్నాయి. సీసీ, ఇంజన్ పవర్, డిజైన్ బట్టి రక రకాల బైక్‌లు ఉన్నాయి.. అయితే వీటన్నిటికి ఒక కనెక్టివిటీ ఉంది. ఇవన్నీ పెట్రోల్‌తో మాత్రమే నడుస్తాయి. ఎందుకంటే వీటికి అమర్చిన ఇంజన్లన్నీ పెట్రోల్‌ ఇంజన్లే. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా ఎలక్ట్రిక్ బైక్ కూడా మార్కెట్లోకి వస్తోంది కానీ ఇప్పటి వరకు డీజిల్ ఇంజన్ ఉన్న బైక్‌ మార్కెట్లోకి రాలేదు. పెట్రోల్‌ ఇంజన్లు తయారుచేసినప్పుడు డీజిల్‌ ఇంజన్లు ఎందుకు తయారుచేయడంలేదు..? ఎప్పుడైనా ఆలోచించారా.. అంతేగాక డీజిల్‌తో కారు ఇంజిన్‌ నడుస్తున్నప్పుడు బైక్‌ ఇంజన్ ఎందుకు నడవదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

వాస్తవానికి డీజిల్ ఇంజిన్ 24:1, పెట్రోల్ ఇంజిన్ నిష్పత్తి 11:1. డీజిల్ ఇంజిన్ అధిక నిష్పత్తి కారణంగా ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఈ ఇంజన్‌ని బైక్‌కి అమర్చాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇది ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. అందుకే బైక్‌కి ఈ ఇంజన్ సరిపోదు. అంతేకాదు ఈ ఇంజన్‌ తయారీకి హెవీ మెటల్ ఉపయోగిస్తారు. ఇది కాకుండా అధిక కంప్రెషన్ నిష్పత్తి కారణంగా డీజిల్ ఇంజిన్‌లో ఎక్కువ వైబ్రేషన్ వస్తుంది. పెట్రోల్ కంటే శబ్దం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు దీనిని తేలికపాటి వాహనాలలో అమర్చితే చాలా సమస్యలను కలిగిస్తుంది.

అంతేకాదు డీజిల్‌ ఇంజన్‌ ఉపయోగించకపోవడానికి కారణం చాలా ఖరీదైనది కూడా. అలాగే దీని కోసం టర్బోచార్జర్ లేదా సూపర్ ఛార్జర్ మొదలైనవాటిని ఉపయోగించాలి. దీని కారణంగా ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే డీజిల్ ఇంజిన్‌లో ఇంధనం కోసం ఫ్యూయల్ ఇంజెక్టర్ టెక్నాలజీని ఉపయోగించాలి. ఇది ప్లగ్ టెక్నాలజీ కంటే చాలా ఖరీదైనది.పెట్రోల్ కంటే డీజిల్‌లో ఎక్కువ శక్తి ఉంటుంది. డీజిల్ మండినప్పుడు దాని నుంచి ఎక్కువ వేడి విడుదల అవుతుంది. ఇది ఇంజిన్, సిలిండర్ భాగాలను దెబ్బతీస్తుంది. అందువల్ల ఈ వేడిని తగ్గించడానికి ఎక్కువ ఉపరితల వైశాల్యం, శీతలీకరణ వ్యవస్థను ఉపయోగించాలి. దీని కారణంగా ఇంజిన్ చాలా పెద్దదిగా మారుతుంది. కాబట్టి దీనిని బైక్‌లో అమర్చలేరు.

Kamala Harris: కమలా హారిస్‌కి అమెరికా అధ్యక్ష బాధ్యతలు.. కారణాలు ఇలా ఉన్నాయి..?

Viral Photos: ఈ తల్లి, కూతురు ఒక మాదిరిగా కనిపిస్తారు.. ఫొటోలు చూస్తే షాక్‌ అవుతారు..

మీకు మాంసాహారం అంటే ఇష్టమా.. అయితే ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకోండి..