
యూపీఐ తమ యూజర్లను కొత్త స్కామ్ గురించి అప్రమత్తం చేస్తోంది. స్కామర్లు కొత్త మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతుండటంతో తన వినియోగదారులకు ముందస్తు అప్రమత్తం చేసింది. మార్కెట్లో కాల్స్ మెర్జ్ కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. కాల్స్ మెర్జ్ చేయడం ద్వారా మీకు తెలియకుండానే వన్-టైమ్ పాస్‌వర్డ్‌లను (OTP) షేర్ చేస్తారు. స్కామర్‌లు అనధికార లావాదేవీలతో మీ అకౌంట్లలో డబ్బును దొంగిలిస్తారు.
ఈ కొత్త స్కామ్ గురించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఎక్స్ వేదికగా యూజర్లను హెచ్చరించింది. స్కామర్లు యూపీఐ ఓటీపీల కోసం మిమ్మల్ని మోసగించేందుకు కాల్ మెర్జింగ్‌ను ఉపయోగిస్తున్నారని, వినియోగదారులు ఇలాంటి మోసాల పాట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అప్రమత్తంగా ఉండండి. మీ డబ్బును కాపాడుకోండి అంటూ పోస్టులో హెచ్చరించింది.
కాల్ మెర్జింగ్ స్కామ్ ఏంటి?
ఈ స్కామ్ అనేది ఒక గుర్తు తెలియని వ్యక్తి.. మీ ఫోన్ నంబర్‌ను స్నేహితుడి నుంచి తీసుకుని కాల్ చేస్తున్నట్టుగా చెబుతాడు. ఆ తర్వాత స్కామర్ ఆ “స్నేహితుడు” వేరే నంబర్ నుంచి కాల్ చేస్తున్నాడని పేర్కొంటూ, కాల్స్ మెర్జ్ చేయమని అడుగుతాడు.
Scammers are using call merging to trick you into revealing OTPs. Don’t fall for it! Stay alert and protect your money. 🚨💳 Share this post to spread awareness!#UPI #CyberSecurity #FraudPrevention #StaySafe #OnlineFraudAwareness #SecurePayments pic.twitter.com/kZ3TmbyVag
— UPI (@UPI_NPCI) February 14, 2025
కాల్ మెర్జ్ అయిన తర్వాత యూపీఐ యూజర్లకు తెలియకుండానే వారి బ్యాంక్ లింక్ అయిన అకౌంట్ ఓటీపీ వెరిఫికేషన్ కాల్‌తో కనెక్ట్ అవుతారు. స్కామర్లు అదే సమయంలో మీ ఓటీపీని స్కాన్ చేస్తారు. ఓటీపీ పొందిన వెంటనే మోసగాళ్ళు మీ బ్యాంకు అకౌంట్లలో నుంచి డబ్బులను కాజేస్తారు.
కాల్ మెర్జ్ స్కామ్ నుంచి రక్షించుకోవడం ఎలా?
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి