Juice Jacking: మీరు బస్టాండు, రైల్వే స్టేషన్‌లలో ఛార్జింగ్‌ పెడుతున్నారా..? మీ బ్యాంకు ఖాతాలు, క్రెడిట్‌ కార్డులో డబ్బు ఖాళీయే..

|

Sep 27, 2022 | 1:24 PM

Juice Jacking: సాధారణంగా చాలా మంది రైల్వే స్టేషన్‌లలో, బస్టాండు, విమానాశ్రయాలు, ఆస్పత్రులు, అలాగే షాపింగ్‌ మాల్స్‌ వంటి బహిరంగ ప్రదేశాలలో మొబైళ్లను ఛార్జింగ్‌..

Juice Jacking: మీరు బస్టాండు, రైల్వే స్టేషన్‌లలో ఛార్జింగ్‌ పెడుతున్నారా..? మీ బ్యాంకు ఖాతాలు, క్రెడిట్‌ కార్డులో డబ్బు ఖాళీయే..
Charging Your Phone At Public Places
Follow us on

Juice Jacking: సాధారణంగా చాలా మంది రైల్వే స్టేషన్‌లలో, బస్టాండు, విమానాశ్రయాలు, ఆస్పత్రులు, అలాగే షాపింగ్‌ మాల్స్‌ వంటి బహిరంగ ప్రదేశాలలో మొబైళ్లను ఛార్జింగ్‌ పెడుతుంటారు. అయితే ఇలా ఛార్జింగ్‌ పెట్టడం ప్రమాదకరమే. ఇలా ఫోన్‌లను, ల్యాప్‌టాప్‌లను ఛార్జింగ్‌ పెట్టడం మీకు సమస్యలు తెచ్చి పెడుతుంటాయి. ఇలా బహిరంగ ప్రదేశాలలో ఛార్జింగ్‌లు పెట్టే సమస్యల్లో చిక్కుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఇలా ఛార్జింగ్‌ పెట్టి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు. ఇలాంటి కేసులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అయితే రైల్వే స్టేషన్‌లో ఛార్జింగ్ పెట్టే ఛార్జర్‌లో ముందుగానే ఓ చిప్ ఇన్‌స్టాల్ చేసి ఉంటారు సైబర్‌ నేరగాళ్లు. దీంతో ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు అది మొబైల్‌లోని మొత్తం డేటాను సేకరించి అందులోకి పంపిస్తుంది. ఇలా చేయడాన్ని జ్యూస్ జాకింగ్ (juice jacking) అంటారు. ఛార్జింగ్‌ పెట్టగానే మీ బ్యాంకు వివరాలతో పాటు ఇతర వ్యక్తిగత వివరాలు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తాయి.
ఇంకేముందు పని పనైపోయినట్లు. మీ బ్యాంకులో ఉన్న డబ్బంతా క్షణాల్లోనే ఖాళీ అయిపోతుంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది ఎలా పని చేస్తుంది?

పెన్‌డ్రైవ్‌లు మొదలైన వాటిలో కనిపించే విధంగా USB పోర్ట్‌లు డేటా బదిలీ కోసం విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. ఒక వినియోగదారు USB పోర్ట్‌కి ఛార్జర్‌ని కనెక్ట్ చేసి, దాన్ని ఆన్ చేసినప్పుడు డేటా బదిలీని సూచించే పాప్‌అప్ వారికి చూపబడుతుంది. ఇలా రైల్వే స్టేషన్‌లు, ఆస్పత్రులు, ఇతర బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన ఛార్జర్‌లలో మీరు ఫోన్‌,ఇతర పరికరాలు ఛార్జింగ్‌ పెట్టగానే మీ వివరాలన్ని హ్యాకర్లకు చేరిపోతాయి. వెంటనే వారు మీ బ్యాంకులో ఉన్న డబ్బంతా వారి ఖాతాల్లోకి మళ్లించుకుంటారు హ్యాకర్లు. ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌, రాజస్థాన్‌, ఒడిశా తదితర రాష్ట్రాల్లో జరిగాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ ఉద్యోగి ఇలాంటి హ్యాకింగ్‌ బారినే పడ్డారు.

 


అలాగే రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఓ ఉద్యోగిణి బహిరంగ ప్రదేశాల్లో ఛార్జింగ్‌ పాయింట్ల నుంచి ఫోన్‌ను ఛార్జింగ్‌ చేశారు. దీంతో వారి వ్యక్తిగత వివరాలుతో పాటు ఆమె మొబైళ్లో ఉన్న ఫోటోలు, వీడియోలు హ్యాకర్లకు చిక్కాయి. వాటిలో తన భర్త ఏకాంతంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలు కూడా ఉన్నాయి. దీంతో హ్యాకర్లు ఆమెను బ్లాక్‌ మెయిలింగ్‌ చేసే పనిలో పడ్డారు. తమకు రూ.5 లక్షలు ఇవ్వకపోతే ఫోటోలన్ని ఇంటర్నెట్‌లో పెడతామని హెచ్చరించారు. వెంటనే ఆమె బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి వ్యక్తులు జ్యూస్‌జాకింగ్‌ బాధితులేనని పోలీసులు చెబుతున్నారు.

 


నేరస్థులు ఉపయోగించే మరో టెక్నిక్‌ ఏంటంటే.. మీరు మీ పరికరాన్ని ఛార్జ్‌ చేస్తున్నప్పుడు వారు పరికరాన్ని ఛార్జ్‌ చేయడానికి మీరు ఉపయోగిస్తున్న పోర్ట్‌ ద్వారా ముఖ్యమైన డేటాను డౌన్‌లోడ్‌ చేస్తారు. డేటాను బదిలీ చేయడానికి యూఎస్‌బీ పోర్టులను ఉపయోగించవచ్చని మీకు తెలిసి ఉండకపోవచ్చు. కొన్ని సార్లు యూఎస్‌బీ కేబుల్‌లను ఉపయోగించి కూడా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లలో ఉండే డేటాను సైతం బదిలీ చేస్తారు. పోలీసులు కూడా ఈ జ్యూస్‌ జాకింగ్‌ గురించి ప్రజలను పదేపదే హెచ్చరిస్తూ ఉన్నారు. ఇటీవల ఒడిశా పోలీసులు బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన యూఎస్‌బీ పోర్టులు, కేబుల్‌లను ఉపయోగించి ఫోన్‌లను, ల్యాప్‌టాప్‌లను ఛార్జ్‌ చేయవద్దని హెచ్చరించారు. ఇంట్లో తప్ప ఇలాంటి బహిరంగ ప్రదేశాలలో ఛార్జింగ్‌ పెట్టుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మీకు తెలియకుండానే ఈ ఫోన్‌లో మాల్వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసి మీ వ్యక్తిగత వివరాలన్నింటిని తెలుసుకుంటున్నారు హ్యాకర్లు. మీరు ఇలాంటి ప్రదేశాలలో ఛార్జింగ్‌ పెట్టుకోకుండా వెంట పవర్‌ బ్యాంకులను తీసుకెళ్లండి. ఇలాంటి విషయాలపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI), పోలీసులు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బ్యాంకు వివరాలు తెలియకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి