
అందివస్తున్న ఆధునిక సాంకేతిక మనిషి సామర్థ్యతను చాటి చెబుతోంది. అదే సమయంలో అది ప్రజా జీవితంలోకి చొరబడి వారిని అసమర్థులుగా మర్చేస్తోందంటే నమ్ముతారా? నమ్మాల్సిందేనండి.. టెక్నాలజీ ఎంత మేలు చేస్తోందో.. దానిని సక్రమంగా వినియోగించుకోకపోతే అంతే స్థాయిలో చేటును కూడా చేస్తుంది. అటువంటి అత్యాధునిక సాంకేతికతకు బెస్ట్ ఉదాహరణ మన స్మార్ట్ ఫోన్. దానిని సక్రమంగా వినియోగించుకుంటే ఎంతోమేలు చేకూరుస్తుంది. అదే సమయంలో దానిని విచ్చలవిడిగా వాడితే నష్టాన్ని తెచ్చిపెడుతుంది.
ప్రస్తుతం చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే.. సోషల్ మీడియాను ఫాలో అవ్వాల్సిందే. అవి లేకపోతే నిమిషం గడవలేని పరిస్థితి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ అంటూ సమయం, అసమయం అంటూ లేకుండా రాత్రి, పగళ్లు దానిలోనే గడుపుతున్న వారు ఉంటున్నారు. ఈ క్రమంలో వారికి సరిగ్గా కామెంట్లు, లైకులు, షేర్లు రాకపోతే తెగ ఫీలైపోతున్న వారు కనిపిస్తున్నారు. కొంత సమయం ఫోన్ కనిపించకపోతే ఏదో పోయిన ఫీలింగ్ వారిని ఆవిరిస్తోంది. ఏదో కోల్పోతున్నామన్న భయాన్ని వారు ఎదుర్కొంటున్నారు. ఈ తరహా ఆలోచనలనే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్.. ఫోమో(FOMO)గా ఆన్‌లైన్ వేదికల్లో వ్యవహరిస్తున్నారు. ఈ ఫోమో గురించి చాలా మందికి తెలిసిందే. ఇప్పుడు దీనికి విరుద్ధంగా రివర్స్ ట్రెండ్ ఒకటి షురూ అయ్యింది అదే జాయ్ ఆఫ్ మిస్సింగ్ ఔట్.. జోమో(JOMO). అంటే సోషల్ మీడియాలో మాయలోపడి ఏదో మిస్ అవుతున్నామన్న భావన జనాల్లో పెరుగుతోంది. ప్రస్తుతం ఈ జోమో ఫీలింగ్ సోషలహ మీడియాను ఊపేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇటీవల కాలంలో మానవ సంబంధాలకు ప్రాధాన్యం పెరుగుతోందని సోషల్ మీడియా ట్రెండ్ స్పష్టం చేస్తోంది. అదెలా అంటారా? ఈ జోమో వ్యవహారం చూస్తే.. మీకే అర్థం అవుతోంది. అసలు జోమో అంటే ఏంటంటే.. సోషల్ మీడియాలో మునిగిపోతూ.. ఫీడ్‌ను ఆస్వాదిస్తూ.. ఇన్ స్టా రీల్స్, స్టోరీలు వంటి చూస్తూ వాటికి అడిక్ట్ అయిపోతూ కుటుంబ సంబంధాలు, చిన్న చిన్న ఆనందాలను దూరం అయిపోతున్న భావనే జోమో. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జోమో ట్రెండ్ షురూ అయ్యింది. ఈ హ్యాష్ (#JOMO) ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. ఒక్క టిక్ టాక్ లోనే 53 మిలియన్ వ్యూస్ వచ్చాయని ఆన్‌లైన్ సంస్థలు నివేదిస్తున్నాయి.
ఈ జోమో అనే పదం కొత్తదేమి కాదు. 2012లోనే యూఎస్‌ఏకు చెందిన అనిల్ డాష్ అనే పారిశ్రామికవేత్త దీనిని పరిచయం చేశారు. తన వ్యాపార పనుల్లో ముగినిపోయి.. తన కొడుకు పుట్టిన సందర్భంలో చాలా ఆనందాలను కోల్పోయాడు. అలా కొడుకు పుట్టిన నెల రోజులకు తాను ఏం కోల్పోయింది తెలుసుకుని ఈ పదాన్ని వినియోగించారు. అప్పటి నుంచి ఇది వాడుకలోకి వచ్చింది.
ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చిన ఈ జోమోతో ఒక వ్యక్తి తాను ఆనందించాల్సిన క్షణాలను గుర్తుచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏదో కోల్పోతున్నామన్న భావన, కుంగుబాటుకు దూరంగా ఉంచేందుకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అలాగే వ్యక్తి పునరుత్తేజితం అవడానికి, పనిపై మరింత ఫోకస్‌పెట్టడానికి ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..