Jio: విశాఖలో సత్తా చాటిన జియో.. బలమైన నెట్‌వర్క్‌తో ప్రత్యేకతను చాటిన రిలయన్స్‌

Reliance Jio: మరోవైపు వాయిస్ సేవలలో కూడా జియో పనితీరు అంతే బలంగా ఉంది. జియో సేవలు అధిక కాల్ సెటప్ సక్సెస్ రేటు, తక్కువ కాల్ సెటప్ సమయం, జీరో కాల్ డ్రాప్ రేటు, అద్భుతమైన వాయిస్ స్పష్టత అందిస్తున్నాయని..

Jio: విశాఖలో సత్తా చాటిన జియో.. బలమైన నెట్‌వర్క్‌తో ప్రత్యేకతను చాటిన రిలయన్స్‌

Updated on: Jul 15, 2025 | 5:21 PM

Reliance Jio: రిలయన్స్ జియో విశాఖపట్నంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న టెలికాం ఆపరేటర్‌గా అవతరించింది. వాయిస్, డేటా పనితీరులో ఇతర టెల్కోలను జియో వెనక్కి నెట్టింది. నగరంలో ఇటీవల ట్రాయ్‌ (TRAI) నిర్వహించిన ఇండిపెండెంట్ డ్రైవ్ టెస్ట్ (IDT)లో జియో తన బలమైన మొబైల్ నెట్‌వర్క్ సామర్ధ్యాన్ని నిరూపించుకుంది. మిలియన్ల మంది వినియోగదారులకు అత్యుత్తమ డిజిటల్ సేవలను అందించడంలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది.

ఇది కూడా చదవండి: Personality Test: మీ ముక్కు ఆకారం ఇలా ఉందా? మీరు ఎలాంటి వారో చెప్పేయవచ్చు!

ట్రాయ్ నివేదిక ప్రకారం.. రిలయన్స్ జియో తన 4G నెట్‌వర్క్‌లో 204.91 Mbps సగటు డౌన్‌లోడ్ వేగాన్ని నమోదు చేసింది. ఇది నగరంలోని అన్ని ఆపరేటర్లలో అత్యధికం. ఈ అసాధారణ పనితీరు వల్ల జియో కస్టమర్‌లు గరిష్ట వినియోగ సమయాల్లో కూడా వేగవంతమైన వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్, వేగవంతమైన యాప్ డౌన్‌లోడ్‌లు, అంతరాయం లేని బ్రౌజింగ్‌ను ఆస్వాదించేలా చేస్తుంది.

ఈ ఫలితాలు.. జియోను అధిక డౌన్‌లింక్ వేగం, తక్కువ లేటెన్సీ కలిగిన ఉత్తమ నెట్‌వర్క్‌గా నిలబెట్టాయి. అతి తక్కువ లేటెన్సీ వినియోగదారులు, సర్వర్‌ల మధ్య డేటా ప్యాకెట్‌లు ప్రయాణించడానికి పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది వీడియో కాన్ఫరెన్సింగ్, ఆన్‌లైన్ గేమింగ్ వంటి రియల్-టైమ్ అప్లికేషన్‌లకు అత్యంత అవసరం.

వాయిస్‌ సేవలలో కూడా సక్సెస్‌ రేటు:

మరోవైపు వాయిస్ సేవలలో కూడా జియో పనితీరు అంతే బలంగా ఉంది. జియో సేవలు అధిక కాల్ సెటప్ సక్సెస్ రేటు, తక్కువ కాల్ సెటప్ సమయం, జీరో కాల్ డ్రాప్ రేటు, అద్భుతమైన వాయిస్ స్పష్టత అందిస్తున్నాయని ట్రాయ్ నివేదిక సూచిస్తోంది.

విశాఖపట్నం అంతటా విస్తృత ప్రాంతాన్ని కవర్ చేసిన ఈ డ్రైవ్ టెస్ట్ ఫలితాలు జియోను అత్యుత్తమ ఆపరేటర్‌గా నిలబెట్టాయి. హై-డెఫినిషన్ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేసినా, హెచ్‌డీ (HD) నాణ్యత వాయిస్ కాల్‌లు చేసినా లేదా రియల్-టైమ్ అప్లికేషన్‌లను యాక్సెస్ చేసినా, ఆంధ్రప్రదేశ్‌లోని మొబైల్ వినియోగదారులకు బెస్ట్ చాయిస్‌గా జియో ముందంజలో ఉంటుంది.

ఇది కూడా చదవండి: Petrol Price: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఎక్కడెక్కడ అంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి